మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ఎందుకు గెలిచాడు అంటే… చాలా రకాల సమాధానాలు వస్తాయి. అందులో ఓటర్ల మొబిలైజేషన్ ఒకటి అని గట్టిగా చెప్పొచ్చు. ‘మా’లో సభ్యత్వం ఉండి… దూర ప్రాంతాల్లో ఉన్నవారి విషయంలో మోహన్‌బాబు – మంచు విష్ణు చాలా ప్లాన్సే వేశారు. వారిని ఆ రోజు హైదరాబాద్ రప్పించి… ఓటు హక్కు వినియోగించుకునేలా చూసుకున్నారు. అయితే దీని కోసం గట్టిగానే ఖర్చయించి అంటున్నారు.
సాధారణ ఎన్నికలను తలపించేలా ఈ ఎన్నికల్లో పోలింగ్ సాగింది. సాధారణ ఎన్నికల్లో అయితే… ఎక్కడో ఉద్యోగం కోసం దూరంగా ఉన్నవారికి టికెట్లు తీసి ఇచ్చి మరి ఓటింగ్‌కి రమ్మంటుంటారు. ఇప్పుడు విష్ణు కూడా అలాంటి పనే చేశాడు అంటున్నారు. ఈ విషయంలోనే ప్రకాశ్‌రాజ్ ఓడిపోయారు అని అంటున్నారు కూడా. బయట రాష్ట్రాల నుండి హైదరాబాద్ వచ్చి ఓట్లు వేసిన వారికి విమాన టికెట్లు, హోటళ్లు… ఇలా సుమారు ₹20 లక్షలు ఖర్చు పెట్టారని టాక్.
ఇది కాకుండా… రెండు ప్యానళ్లు లంచ్ మీటింగ్‌లు, డిన్నర్ మీటింగ్‌లు పెట్టాయి. సుమారు ఏడు సార్లు ఈ మీటింగ్‌లు జరిగాయి. ఎంత కాదన్నా… ఒక్కో మీటింగ్‌కి ₹ఆరు నుండి ₹8 లక్షలు ఖర్చయి ఉంటుంది. ఆ లెక్కన అదొక సుమారు₹60 లక్షలు. మిగిలిన ఖర్చులు, వాహనాలు అన్నీ మరో ₹20 లక్షలు వరకు అయ్యుంటాయని టాక్. దీంతో మొత్తం ఈ ఎన్నికల కోసం సుమారు కోటి రూపాయలు ఖర్చు చేశారని టాక్. ఈ ఎన్నికలకు అంత అవసరమా అంటే ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు మరి.