Manchu Viranica: ఆ బిజినెస్ లో మంచు విష్ణు భార్య సక్సెస్ సాధిస్తారా?

సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో మంచు హీరోల సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా సరైన సినిమా పడితే మంచు ఫ్యామిలీ మళ్లీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ మంచు హీరోల సినిమాల ఫలితాలపై ప్రభావం చూపుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా మంచు విష్ణు భార్య విరానిక బ్రైడల్ డిజైనర్ వేర్ ను మొదలుపెట్టారు.

ఇప్పటికే విద్య, వ్యాపార రంగాలలో సత్తా చాటిన విరానిక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ద్వారా తన బిజినెస్ ను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒకవైపు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు మరోవైపు బిజినెస్ లో రాణిస్తున్న విరానిక టాలెంట్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. తన బ్రాండ్ గురించి విరానికా మాట్లాడుతూ చేతితో పట్టు చీరలను డిజైన్ చేయడం తమ ప్రత్యేకత అని తెలిపారు. ఈ చీరలను తయారు చేయాలంటే 45 రోజుల నుంచి 75 రోజుల సమయం పడుతుందని ఆమె కామెంట్లు చేశారు.

చీరను తయారు చేయడం కోసం టిష్యూ, గోల్డ్, జరీ ఇలా వేర్వేరు మెటీరియల్స్ ను వినియోగిస్తామని విరానికా చెప్పుకొచ్చారు. ఈ చీరలను కొనుగోలు చేయాలంటే కనీసం 20 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. విరానికా బ్రైడల్ శారీలో మృణాల్ మాత్రం మరింత అందంగా కనిపించారు. తన బ్రాండ్ ను మరింత ఎక్కువగా ప్రమోట్ చేయడానికి విరానికా ప్రయ్తత్నిస్తున్నారు.

ఈ బిజినెస్ లో విరానికాకు భారీ లాభాలు సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. విరానికా కెరీర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. విరానికా కెరీర్ ప్లానింగ్ ను నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus