Manoj Bajpayee: ‘సత్య’ జ్ఞాపకాలు షేర్‌ చేసుకున్న మనోజ్‌… ఏం చెప్పారంటే?

  • July 6, 2023 / 01:38 PM IST

ఇండస్ట్రీలో మేం చూసిని వరెస్ట్‌ సినిమా ఇదే… లాంటి కామెంట్స్‌ ఇప్పుడు కూడా వింటుంటాం. ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎవరు చెప్పినా, గుర్తు చేసినా ఇదే మాట గుర్తొస్తుంది. అయితే రిలీజ్‌ అయిన తొలి నాళ్లలో అలాంటి కామెంట్స్‌ ఎదుర్కొన్న సినిమా భారతీయ సినీ పరిశ్రమలో ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది అంటే నమ్ముతారా? ఆ సినిమానే ‘సత్య’. జేడీ చక్రవర్తి, మనోజ్‌ బాజ్‌పాయ్‌, ఊర్మిళ ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అందులో భికూగా నటించిన మనోజ్‌ భాజ్‌పాయ్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

‘సత్య’ సినిమాను బాలీవుడ్‌లో గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తాను అని మనోజ్‌ అన్నారు. ఈ సినిమాతోనే రూపకర్తలు సినిమాని జనం కోణం నుండి చూడటం ప్రారంభించారు అని తెలిపారు. కల్పిత కథలు, మూస హీరోయిజం పక్కకు పెట్టి మిగిలిన దర్శకులు సినిమాలు ఆలోచించడం మొదలుపెట్టారని మనోజ్‌ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌ కథల ట్రెండ్‌ పెరిగిందన్నారు. ఆ సినిమా విడుదలైన వారం దాకా థియేటర్లలో జనమే లేరట. బాగుంది అనే నోటి మాటతో ప్రచారం మొదలయ్యాక ఒక్కసారిగా ప్రేక్షకులు పోటెత్తారట.

సినిమా విడుదలైన రెండో వారం నుండి థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్‌ బోర్డులు రోజూ ఉండేవాట. అలా ‘సత్య’ సినిమా 25 వారాలపాటు ఏకధాటిగా ఆడిందట. ‘సత్య’ విజయం వల్ల మనోజ్‌ మంచి పాత్రలు వచ్చి పరిశ్రమలో మంచి గౌరవం దక్కిందట. అప్పటివరకు తన వల్లు అవుతుందా అనే డౌట్‌ ఉన్న పెద్ద పెద్ద ఆఫీసుల్లోకి అడుగు పెట్టగలిగానని మనోజ్‌ అన్నారు. సినిమాకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చినప్పుడు నమ్మలేకపోయారట మనోజ్‌.

అవార్డు విషయం సెక్రెటరీ భాస్కర్‌ శెట్టి వచ్చి (Manoj Bajpayee) మనోజ్‌కి చెప్పాడట. అప్పటికీ నమ్మకం కలగపోవడంతో… ‘వెంటనే న్యూస్‌ చూడు’ అన్నాడట. అప్పుడు చూసి కన్‌ఫామ్‌ చేసుకున్నాను అని మనోజ్‌ తెలిపారు. ఆయన గతంలో బిహార్‌లో ఉన్నప్పుడు రౌడీలు, నేరస్థులను గమనిస్తూ ఉండేవాడట. రామ్‌ గోపాల్‌వర్మ పరిశోధన చేసి అండర్‌వరల్డ్‌ డాన్‌ల గురించి తెలుసుకున్నారు.. సినిమా సమయంలో ఆ విషయాలన్నీ మనోజ్‌కు చెప్పేవారట. ఇక ఈ సినిమా సంగతి చూస్తే… జులై 3, 1998న విడుదలై భారీ విజయం అందుకుంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus