Masooda Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘మసూద’ ..!

‘మళ్ళీ రావా’ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి మంచి హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ‘స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్ పై రూపొందిన మూడో చిత్రం ‘మసూద’. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో ‘గంగోత్రి’ చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరొందిన కావ్య కళ్యాణ్ రామ్ ఇంపార్టెంట్ రోల్ పోషించగా సంగీత, తిరువీర్ కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అందుకు తగ్గట్టే ఈ మూవీకి ఫస్ట్ డే పాజిటివ్ టాక్ లభించింది. ఓపెనింగ్స్ విషయంలో మొదటి రోజు అంతంత మాత్రంగానే పెర్ఫార్మ్ చేసినా.. రెండో రోజు, మూడో రోజు గ్రోత్ ను చూపించింది. మొదటి రోజు ని మించి రెండో రోజు, రెండో రోజు ని మించి మూడో రోజు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ ను పూర్తిచేసుకుంది ఈ మూవీ.4 వ రోజున కూడా ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 0.65 cr
సీడెడ్ 0.34 cr
ఆంధ్ర 0.67 cr
ఏపీ +తెలంగాణ 1.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.35 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.01 cr

‘మసూద’ చిత్రానికి రూ.1.25 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.1.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసిన ఈ మూవీ 4 రోజుల్లో రూ.2.01 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆల్రెడీ బయ్యర్స్ అంతా ప్రాఫిట్ జోన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ స్టడీగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus