మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఉండే సందడి ఇప్పుడు ‘మాస్ జాతర’ విషయంలో కనిపించడం లేదు. రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైనా, సినిమాపై కనీస హైప్ కూడా క్రియేట్ అవ్వలేదు. అసలు ఈ సినిమా వస్తున్నట్టే చాలామందికి తెలియదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి లేకపోవడానికి చాలా కారణాలున్నాయి. హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ఇద్దరూ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు.
అటు నిర్మాత నాగవంశీకి కూడా ఈమధ్య కాలంలో సక్సెస్ లేదు. దీనికి తోడు ఈ ప్రాజెక్ట్ ఎన్నోసార్లు వాయిదా పడటం కూడా బజ్‌ను పూర్తిగా చంపేసింది. అక్టోబర్ 31న ప్రీమియర్లతో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్‌గా ఉన్నాయి. మరోవైపు, ‘మోంథా’ తుపాను రూపంలో మరో పెద్ద దెబ్బ పడింది. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు.

ఇలాంటి టైమ్‌లో వాళ్లు థియేటర్లకు వస్తారని ఆశించడం కష్టమే.నిజానికి ఇది సరైన రిలీజ్ డేట్ కాదని, పైగా నెలాఖరు కావడంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుందని తెలిసినా నిర్మాత ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఓటీటీ(నెట్ ఫ్లిక్స్) పార్ట్‌నర్ ఒత్తిడి వల్లే ఈ తేదీకి సినిమాను రిలీజ్ చేయక తప్పడం లేదని ఇండస్ట్రీ టాక్.

ఇక ‘మాస్ జాతర’ భవిష్యత్తు మొత్తం ప్రీమియర్ల టాక్‌పైనే ఆధారపడి ఉంది. ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ టాక్ వస్తేనే, మరుసటి రోజు ఓపెనింగ్స్ అయినా డీసెంట్‌గా ఉంటాయి. లేదంటే మాత్రం రవితేజ కెరీర్‌లో ఇది మరో డిజాస్టర్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
