భూపతి రాజు రవిశంకర్ రాజు.. ఇలా చెప్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అదే రవితేజ అంటే మాస్ మహారాజ్ కదా అంటారు. అంతలా రవితేజను ఓన్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఓ లైట్ మెన్ గా కెరీర్ ను ప్రారంభించిన రవితేజ… తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి.. చిన్న చిన్న పాత్రల ద్వారా ఆడియన్స్ కు పరిచయమై ఈరోజు స్టార్ గా ఎదిగాడు. రవితేజ కెరీర్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి.
వైవిఎస్ చౌదరి, గుణశేఖర్ వంటి దర్శకులతో పాటు ఓ చిన్న రూంలో ఉండే రవితేజ ఆ తర్వాత ఓ రూ.3 లక్షల హీరోగా మారాడు. కెరీర్ ప్రారంభంలో రవితేజ.. జె డి చక్రవర్తి, జగపతి బాబు.. వంటి హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించేవాడు. కానీ కొన్నాళ్ల తర్వాత ఇతను హీరోగా నటించిన సినిమాల్లో జె.డి.చక్రవర్తి, జగపతి బాబు సైడు క్యారెక్టర్లు చేశారు. రవితేజలో ఇంకో గొప్పతనం ఏంటి అంటే.. అతను ఎప్పుడూ పెద్ద డైరెక్టర్లతో మాత్రమే పనిచేయలేదు.
కొత్త డైరెక్టర్లకు, ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు అతను ఛాన్స్ ఇచ్చాడు. బోయపాటి, బాబీ, హరీష్ శంకర్, శ్రీను వైట్ల వంటి దర్శకులను పరిచయం చేసింది రవితేజనే..! ఇదిలా ఉండగా.. రవితేజ కెరీర్ ప్రారంభంలో తనకు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే సరిపోద్ది అనుకున్నాడట. జీరో నుండి కెరీర్ ను మొదలుపెట్టాడు. రూ.700 చెల్లించే అద్దింట్లో ఉండేవాడు. అలాంటి వాడికి అత్యాశలు ఎందుకు ఉంటాయి చెప్పండి.
కానీ క్రమ క్రమంగా ఎదుగుతూ వచ్చిన రవితేజ ఇప్పుడు రూ.12 కోట్ల విలువగల ఇంట్లో ఉంటున్నాడు. ఈ విషయాన్ని అతని స్నేహితుడు కమల్ చెప్పుకొచ్చాడు. ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంలో హీరోగా నటించాడు కమల్. ఈ మధ్యనే అతను రవితేజని కలిశాడట. ‘హైదరాబాద్లో ఓ ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు అనుకుని వచ్చాను.. తర్వాత వచ్చింది అంతా బోనస్’ అంటూ కమల్ కు రవితేజ చెప్పాడట.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?