Ravi Teja: ‘వాల్తేరు వీరయ్య’ లో ‘విక్రమ్ సాగర్ ఏసీపీ’ గా ‘మాస్ మహారాజా’ రవితేజ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ లో ‘మాస్ మహారాజా’ రవితేజ కీలకపాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.. సోమవారం రవితేజ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ రిలీజ్ చేసింది టీమ్.. ‘పవర్ హ్యాజ్ ఏ న్యూ నేమ్’.. అంటూ ‘విక్రమ్ సాగర్ ఏసీపీ’ గా రవిని ప్రేక్షకులకు పరిచయం చేశారు.. ‘ఫస్ట్ టైం ఒక మేకపిల్లని ఎత్తుకుని పులి వస్తా ఉన్నాది’.. అంటూ స్టార్ట్ అయిన టీజర్‌కి మంచి స్పందన వస్తోంది.. ‘విక్రమ్ సాగర్ ఏసీపీ’ గా మాస్ మహారాజా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు రివీల్ చేశారు.

‘ఏం రా వారి .. పిసా పిసా జేస్తున్నవ్.. నీకింకా సమజ్ కాలే.. నేన్ ఎవ్వన్నయ్యకీ ఇననని’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.. వీరయ్యకీ, ఏసీపీకీ లింక్ ఏంటనేది ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థమవుతోంది.. మాస్ రాజా స్క్రీన్ ప్రజెన్స్, విజువల్స్, డీఎస్పీ బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి.. ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ కలిపి దాదాపు 45 నిమిషాల పాటు రవితేజ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం.. ‘అన్నయ్య’ తర్వాత చిరుతో ఆయన నటిస్తున్న చిత్రమిది..

ఇద్దరూ కలిసి కనిపిస్తే థియేటర్లలో దబిడి దిబిడే అని ఈ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది.. వచ్చే సంక్రాంతికి పూనకాలు లోడింగ్ కాదు డబుల్ లోడింగ్ అనిపిస్తోంది.. ప్రస్తుతం చిరు, శృతిల మీద ‘‘నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరుని అవుతా’’ అనే సాంగ్‌ని ఫ్రాన్స్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్లలో పిక్చరైజ్ చేస్తున్నారు.

‘‘ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర’’ అంటూ.. ఫ్యామిలీతో పాటు ‘వాల్తేరు వీరయ్య’ కథానాయిక శృతి హాసన్‌తో ఉన్న ఫోటోలని చిరు షేర్ చేయగా బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.. జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.. ‘ఖైదీ నెం:150’ తర్వాత సంక్రాంతి సీజన్‌లో వస్తోన్న మెగాస్టార్ సినిమా ఇదే కావడం విశేషం..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus