బిగ్ బాస్ 4: బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోయిందా..?

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరో ప్రేక్షకులు ముందుగానే ఊహించి మరీ చెప్పేస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడున్న ఓటింగ్ పర్సెంటేజ్ నుంచీ గెస్ చేసి సోషల్ మీడియాలో షేర్లు చేసేస్తున్నారు. 12వ వారం హౌస్ లో వైల్డ్ కార్డ్ రీ ఎంట్రీ ఉండబోతోందని విస్తృతంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నోయల్ , కుమార్ సాయి ఇద్దరిలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వచ్చింది. కానీ, ఇంతవరకూ ఎవరూ హౌస్ లోకి వెళ్లలేదు. ఒకవేళ వెళితే అది అన్ ఫెయిర్ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు, దీనివల్ల 13వ వారం , 14వ వారం నామినేషన్స్ లోకి స్ట్రాంగ్ ప్లేయర్ వస్తే ఎలిమినేట్ అయిపోతారని కూడా చెప్తున్నారు. అయితే, ఫినాలే రేస్ లో మాత్రం ముగ్గురు ఖచ్చితంగా ఉంటారని, వారిలో అభిజిత్, హారిక, సోహైల్ ఈ ముగ్గురూ కూడా టైటిల్ కోసం పోరాడతారని అంటున్నారు.

ఆవారం వాళ్ల గేమ్ ని బట్టీ చూస్తే ఎవరు టాప్ 1లో నిలుస్తారనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. హారిక, సోహైల్ మాస్ ఆడియన్స్ ని బాగా ఆకర్షించి దూసుకుని వెళ్లిపోతే, అభిజిత్ ఫస్ట్ నుంచి మైండ్ గేమ్ ఆడుతూ గేమ్ ని బాగా ఎనలైజ్ చేస్తున్నాడు. మరి ఈ ముగ్గురులో ఎవరు టైటిల్ ని గెలుచుకోబోతున్నారనేది ఆవారం ఓటింగ్ ని బట్టీ ఆధారపడి ఉంటుంది.

అయితే, కొన్ని స్పెషల్ గ్రూప్స్ లో మాత్రం ఈ సీజన్ కి అభిజిత్ టైటిల్ విన్నర్ రాస్కోండి అంటూ చెప్పేస్తున్నారు. అభిజిత్ జెర్నీలో ఇప్పటివరకూ చాలాసార్లు నామినేషన్ లిస్ట్ లోకి వచ్చాడు. హ్యూజ్ ఓటింగ్ పర్సెంటేజ్ ని కూడా దక్కించుకున్నాడు. అలాగే, హారిక – సోహైల్ లకి కూడా హ్యూజ్ ఓటింగ్ అనేది జరిగింది. సో, ఈ లెక్కలన్నీ వేసి ఈముగ్గురు మాత్రమే టాప్ – 3 లో ఉంటారని, ఇందులో అభిజిత్ – సోహైల్ – హారికల్లో ఒకరు విన్నర్ ఖచ్చితంగా అవుతారని జోస్యం చెప్తున్నారు. అదీ మేటర్.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus