ఈ మధ్య చాలా మంది సినీ సెలబ్రెటీలు మరణించారు. ఇటీవల చూసుకుంటే మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, ‘సింటోనియా’ నటి బ్రెజిలియన్ చైల్డ్ ఆర్టిస్ట్, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి వంటి వారు మరణించారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకముందే… మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. మాస్టర్ భరత్ (Master Bharath) తల్లి కమలహాసిని నిన్న అంటే ఆదివారం నాడు రాత్రి 8 గంటలకు మృతి చెందారు. తల్లితో కలిసి చెన్నైలో నివాసముంటున్నాడు భరత్. అయితే నిన్న ఈమెకు సడన్ గా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది. దీంతో భరత్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్లోని సినీ పెద్దలు కొంతమంది భరత్ కు ఫోన్ చేసి ధైర్యం చెబుతూ సానుభూతి తెలుపుతున్నట్టు సమాచారం.
‘వెంకీ’ (Venky) ‘ఢీ’ (Dhee) ‘రెడీ’ (Ready) ‘కింగ్’ (King) ‘బిందాస్’ (Bindaas) ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr. Perfect) వంటి సినిమాల్లో మాస్టర్ భరత్ నటన నవ్వులు పూయించింది. అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. పెద్దయ్యాక మంచు విష్ణు (Manchu Vishnu) ‘దేనికైనా రెడీ’ (Denikaina Ready) ఎన్టీఆర్ (Jr NTR) – శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్లో వచ్చిన ‘బాద్ షా’ (Baadshah), అల్లు శిరీష్ (Allu Sirish) ‘ఎబిసిడి’ (ABCD) గోపీచంద్ (Gopichand) ‘విశ్వం’ (Viswam) వంటి సినిమాల్లో నటించాడు. కానీ నటుడిగా సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. ఇలాంటి టైంలో తల్లి మరణించడం అతన్ని మానసికంగా మరింత కృంగదీసే అవకాశం లేకపోలేదు.