ఈ సంక్రాంతి సీజన్ కి వస్తున్న సినిమాల్లో డబ్బింగ్ సినిమా అయినా కూడా విజయ్ మాస్టర్ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసంట్ గా లాక్డౌన్ కారణంగా అన్ని భాషల్లో సినిమాలని ఆస్వాదించిన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు మాస్టర్ సినిమాని కూడా థియేటర్స్ లో చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 13వ తారీఖు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి మంచి మార్కెట్ అయినట్లుగా సమాచారం. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ద్వారా ఇప్పటికే మంచి బిజినెస్ అయినట్లుగా తెలుస్తోంది. నైజాం, సీడెడ్, నెల్లూర్, ఈస్ట్ , వెస్ట్, ఇలా అన్ని చోట్ల భారీగా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలో వచ్చిన విజయ్ విజిల్ సినిమాకి తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. 9కోట్లకి ప్రీరిలీజ్ బిజినెస్ అయితే దాదాపుగా ఈ సినిమా 11కోట్ల షేర్ ని వసూలు చేసింది. అందుకే ఇప్పుడు మాస్టర్ సినిమాని కూడా ఫ్యాన్సీ రేటుకి తెలుగు థియేట్రికల్ రైట్స్ కొన్నట్లుగా తెలుస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం ఇలా అన్ని ఏరియాల్లో కలిపి ఇప్పటికే మాస్టర్ సినిమా 200కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇది విజయ్ బిగిల్ ( విజిల్ ) సినిమాకంటే చాలా ఎక్కువ.
ముఖ్యంగా ఓవర్సీస్ లో మలేషియాలో విజయ్ సినిమాలకి మంచి మార్కెట్ ఉంటుంది. అలాగే, కన్నడలో కూడా మనోడికి పెద్ద మార్కెట్ ఉంది. ఇక తెలుగులో ఈ సంక్రాంతికి విజయ్ సాలిడ్ హిట్ కొట్టేలాగానే కనిపిస్తున్నాడు. సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా తెలుగులో పెద్ద హీరోకి వచ్చినన్ని కలక్షన్స్ వచ్చేస్తాయి. కొడితే బాక్సీఫీస్ బద్దలవ్వాల్సిందే. మరి మాస్టర్ ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తాడో చూడాలంటే మనం పండగ వరకూ ఆగాల్సిందే.
Most Recommended Video
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!