Mathu Vadalara 2 Twitter Review: ‘మత్తు వదలరా 2’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

2019 చివర్లో వచ్చిన ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) చిత్రం మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కామెడీ యూత్ ను అమితంగా ఆకట్టుకుంది. సత్య పలికిన ‘తస్కరించుట’ అనే డైలాగ్ అయితే మీమ్స్ రూపంలో బాగా ట్రెండ్ అయ్యింది. రితేష్ రానా (Ritesh Rana) ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక దాదాపు 5 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ రూపొందింది.

Mathu Vadalara 2 Twitter Review

ఈరోజు అనగా సెప్టెంబర్ 13 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఆల్రెడీ ఓవర్సీస్లో షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్కువశాతం ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ట్విట్టర్ టాక్ ను గమనిస్తే : ‘ ‘మత్తు వదలరా 2 ‘ (Mathu Vadalara 2)ఓ టైం పాస్ ఎంటర్టైనర్ అని , మరోసారి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సత్య కామెడీ హైలెట్ అయ్యిందని..

ప్రేక్షకులు అతని కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారని, ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా.. ఫాస్ట్ గా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుందని, సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ ఫ్లో తగ్గి, సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుందని , అందువల్ల కొంత డ్రాగ్ అనిపించినట్టు’ చెబుతున్నారు. అయితే కొన్ని ట్విస్ట్..లు, సత్య (Satya Akkala) కామెడీ..ల కోసం కచ్చితంగా ఒకసారి చూసే విధంగా ఉంది అంటున్నారు. మరి (Mathu Vadalara 2) మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి

సిద్ధూ-బాలయ్య..ల బాండ్ అలాంటిది మరి.. వీడియో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus