శివ చేసిన ఆ పనికే బిందు నామినేట్ చేసిందా..! ఈవారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే..!

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ఘట్టం మరోసారి హౌస్ ని వేడెక్కించేలా చేసింది. ముఖ్యంగా బిందుమాధవికి, శివకి గట్టిగా పడింది. ఇద్దరూ ఆర్గ్యూమెంట్స్ అనేవి పీక్స్ కి వెళ్లాయి. మొత్తం 9మందిలో ఈసారి 7మంది వరకూ నామినేట్ అయినట్లుగా సమాచారం. ఇందులో బాబాభాస్కర్ ఈవారం కెప్టెన్ కాబట్టి నామినేషన్స్ లో లేరు. అలాగే, నటరాజ్ మాస్టర్ ని కూడా ఎవరూ నామినేట్ చేయలేదు. మిగిలిన ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. బిందుమాధవి, అఖిల్, శివ, అరియానా, అనిల్, అషూరెడ్డి, ఇంకా మిత్రా శర్మాలు నామినేషన్స్ లో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక్కడే బిందుమాధవి మరోసారి యాంకర్ శివని నామినేట్ చేసింది.

ఏదైతే అషూ ఇష్యూ ఉందో దాన్ని మరోసారి తెరపైకి తీస్కుని వచ్చింది. అషూరెడ్డి కూడా ఇదే పాయింట్ లో శివని నామినేట్ చేసింది. నువ్వు చేసింది తప్పుకాదని నువ్వు అనుకుంటున్నావా అని క్లియర్ గా అడిగింది అషూ. అలాగే, బిందు కూడా నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పే అంటూ బలంగా చెప్పింది. బాత్రూమ్ లో లేడీ గెటప్ వేసేటపుడు యాంకర్ శివ అషూని బటన్స్ తీయి అంటూ నాలుగు సార్లు అడిగాడు. ఇన్నర్ ఎలాంటిది కావాలో చెప్పేందుకు ఇలా మాట్లాడాడు. కానీ, ఈవిషయంలో అషూ హర్ట్ అయ్యింది.

లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఈ ఇష్యూని లేపింది. దీంతో వీకండ్ నాగార్జున క్లియర్ గా యాంకర్ శివది తప్పు అని చెప్పాడు. దీంతో శివ వీకండ్ షోలో అషూకి సారీ చెప్పాడు. ఈ పాయింట్ ఇప్పుడు నామినేషన్స్ లో లేవనెత్తింది అషూ. శివ నువ్వు చేసింది తప్పంటూ మరోసారి మాట్లాడింది. ఇక అషూ నాకు తెలియదని, నిజంగా ఆ విషయం నాకు గుర్తు ఉండి ఉంటే అప్పుడే సారీ చెప్పేవాడ్ని అని శివ అన్నాడు. అంతేకాదు, ఇదే విషయంలో బిందుమాధవి కూడా శివని నామినేట్ చేస్తూ ఆర్గ్యూ చేసింది. నీకు తప్పు అనిపించిందా అంటూ క్లియర్ గా శివ అడిగితే, యస్ తప్పే అంటూ క్లారిటీగా చెప్పింది. రైట్ రీజన్ కి నువ్వు సారీ ఫీల్ అవ్వలేదు అని అనిపించిందని చెప్పింది బిందు.

10వ వారం నామినేషన్స్ లో ఒకరికొకరు ఛేదు లడ్డూలు తినిపించుకుంటూ మరీ నామినేట్ చేసుకున్నారు. అఖిల్ అండ్ అరియానాల మద్యలో కూడా మాటల యుద్ధం జరిగింది. లేడీ కంటెస్టెంట్ ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని నువ్వు జెండర్ తీస్కుని రావడం కరెక్ట్ గా అనిపించలేదని అఖిల్ అంటే, అది బయట టాక్ కూడా అలాగే ఉందని, లాస్ట్ సీజన్ లో కూడా నేను ఇలాగే మాట్లాడాను అని అరియానా చెప్పింది. అలాగే, నేను ఫిమేల్ కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ గట్టిగా అరిచి మరీ చెప్పింది. వీరిద్దరి మద్యలో కూడా ఆర్గ్యూమెంట్స్ పీక్స్ కి వెళ్లాయి. మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus