2025లో ఇప్పటికే రెండు నెలలు ముగిసిపోగా, బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు సందడి చేశాయి. కొన్ని భారీ విజయాలను సాధించగా, మరికొన్ని ఊహించిన స్థాయిలో రాణించలేకపోయాయి. అయితే సినిమా (Movies) ప్రేమికుల కళ్లంతా ఇప్పుడు మే నెలవైపే ఉంది. ఎందుకంటే ఈ నెలలో వరుసగా మూడు క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మే నెలను గ్రాండ్‌గా ప్రారంభించనున్న నేచురల్ స్టార్ నాని (Nani) , హిట్ 3 (HIT 3) మూవీతో సాలిడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
హిట్ ప్రాంచైజీలో ఇది మూడో భాగం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఇదే రోజు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) రెట్రో (Retro) మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.
కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వింటేజ్ యాక్షన్ నేపథ్యంలో రూపొందింది. ఇటీవలే సూర్య కంగువా (Kanguva) చిత్రంతో నిరాశపరిచిన నేపథ్యంలో, ఈ సినిమా అతనికి మళ్లీ మంచి హిట్ అందిస్తుందనే ఆశలు ఉన్నాయి. మేకర్స్ ఇప్పటికే సినిమాపై బలమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు. మే నెల చివర్లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కింగ్‌డమ్ (Kingdom) మూవీతో థియేటర్లలోకి రానున్నాడు. మే 30న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు.
టీజర్‌లో పోలీస్ గెటప్‌లో విజయ్ స్టైలిష్ యాక్ట్ చేయడంతో మూవీపై ఆసక్తి పెరిగింది. కొత్త కథాంశంతో సినిమా రూపొందుతుండటంతో, విజయ్ ఫ్యాన్స్ ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతారని నమ్మకంగా ఉన్నారు. ఈ మూడు సినిమాలు త్రిముఖ పోటీకి సిద్ధమవుతుండటంతో, మే నెల టాలీవుడ్ థియేటర్లకు అసలైన పండగే కానుంది. హిట్ 3, రెట్రో, కింగ్‌డమ్.. ఏది బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందో చూడాలి.