‘ధమాకా’ తో (Dhamaka) రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన దర్శకుడు త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మజాకా’ (Mazaka). శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) దీనికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో సో సో ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. కానీ మిక్స్డ్ టాక్ ఎఫెక్ట్, పరీక్షల సీజన్ వల్ల వీకెండ్ తర్వాత ఈ సినిమా ఓపెనింగ్స్ తగ్గిపోయాయి.
Mazaka Collections:
రెండో వీకెండ్ కి కొంత హోప్స్ పెట్టుకుంది ఈ సినిమా. అయితే ‘సీతమ్మ వాకిట్లో..'(రీ- రిలీజ్), ఛావా(తెలుగు వెర్షన్) వంటి సినిమాలు పోటీగా ఉండటం వల్ల… బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్సులు అయితే ఎక్కువ కనిపించడం లేదు. ఒకసారి (Mazaka) 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘మజాకా’ చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజుల్లో ఈ సినిమా రూ.5.46 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.54 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా రూ.10.32 కోట్లు రాబట్టింది.