హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్ కి (Rukshar Dhillon) కోపం వచ్చింది. అవును నిజమే..! విషయంలోకి వెళితే.. కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ‘దిల్ రుబా’ (Dilruba) సినిమా మార్చి 14న రిలీజ్ కాబోతోంది. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ట్రైలర్ లాంచ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ బాగా జరిగింది. అయితే ఇందులో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అదే రుక్సార్ ధిల్లాన్ కి కోపం తెప్పించింది అని చెప్పొచ్చు. ‘తాము(హీరోయిన్లు) స్టేజ్ పై ఉన్నప్పుడు, స్పీచ్ ఇస్తున్నప్పుడు ఫొటోలు తీయొద్దు.
అవి చాలా అన్- కంఫర్టబుల్ గా(ఇబ్బంది కరంగా) అనిపిస్తున్నాయి. మేము స్టేజిపైకి వచ్చినప్పుడు, దిగే టైంలో, మాట్లాడుతున్నప్పుడు.. కొంతమంది అన్-కంఫర్టబుల్ గా ఫోటోలు తీస్తున్నారు. ఈవెంట్లు అయ్యాక వెళ్లి సోషల్ మీడియాలో చూసుకుంటే అవి చాలా బాధిస్తున్నాయి. నాకు పేర్లు(హ్యాండిల్స్) వంటివి బహిరంగంగా చెప్పడం ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రుక్సర్. ఆమె ఇలా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సినిమా వేడుకల్లో ఫోటో గ్రాఫర్లు హీరోయిన్లను ఫోటోలు తీయడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. ఎంట్రీ వద్ద కూడా ఫోటో గ్రాఫర్లని అడిగి మరీ ఫోటోలు తీయించుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు స్టేజిపై ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు.. ఫోటోలు తీసి కొంతమంది క్రాప్ చేసి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రీచ్ కోసం పోస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు ‘ఇలాంటివి కావాలి వైరల్ అవ్వాలి’ అని కోరుకుంటారు. రుక్సర్ మాదిరి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారని కూడా ఈరోజుతో అందరికీ మరింత క్లారిటీ వచ్చింది.
Moorthy Thatha- Manalne naa Manalni kaadhu lee #Dilruba pic.twitter.com/D3JCV7nAXc
— Srinivas RT Fan (@srinivasrtfan) March 6, 2025