సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మజాకా’ (Mazaka) సినిమా నిన్న అంటే శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న రిలీజ్ అయ్యింది. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర (Anil Sunkara) కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ‘మన్మధుడు’ బ్యూటీ అన్షు రీ (Anshu Ambani) ఎంట్రీ ఇచ్చింది. ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) దీనికి కథ, స్క్రీన్ ప్లే అందించారు.
మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ ఉన్నా… ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.40 cr |
సీడెడ్ | 0.15 cr |
ఉత్తరాంధ్ర | 0.18 cr |
ఈస్ట్ | 0.08 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.17 cr |
కృష్ణా | 0.14 cr |
నెల్లూరు | 0.06 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.23 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.27 cr |
తెలుగు వెర్షన్ (టోటల్) | 1.50 cr |
‘మజాకా’ (Mazaka) చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.9.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా రూ.2.7 కోట్లు రాబట్టింది.