తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే కుటుంబాలలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా ఒకటి. దాదాపు మూడున్నర దశాబ్ధాల పాటు టాలీవుడ్‌ను రారాజుగా ఏలారు చిరు. బిగ్గర్ దెన్ బిగ్‌బిగా.. సౌత్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. ఆయన కుటుంబం నుంచి నాగబాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, సాయి థరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, వరుణ్ తేజ్, నిహారిక, అల్లు శిరిష్ వంటి వారు చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. తద్వారా పరిశ్రమలోనే అత్యధిక మంది హీరోలున్న ఫ్యామిలీగా మెగా కుటుంబం నిలిచింది.
నిజానికి చిరంజీవిది పశ్చిమ గోదావరి జల్లా మొగల్తూరు చెందిన ఒక కాపు ఫ్యామిలీ. చిరంజీవి తన కులానికే చెందిన దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లాడారు. అయితే ఆయన తనయుడు రామ్‌చరణ్ మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు. ఈమె స్వయానా అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు. ఇక చిరంజీవి బావ అల్లు అరవింద్ కుమారుడు హీరో అల్లు అర్జున్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్నేహా రెడ్డిని పెళ్లాడారు.
ఈమె తెలంగాణలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల అధిపతి అయిన వ్యక్తి కుమార్తె. తద్వారా మోహన్ బాబు కుటుంబంలోలాగే చిరు ఫ్యామిలీకి కూడా రెడ్డి వర్గంతో బంధుత్వం వుంది. పెదరాయుడు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లు పెళ్లి చేసుకున్న అమ్మాయిలు రెడ్డి వర్గానికి చెందిన వారేనన్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!