మన ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం చాలా మంచి నిర్ణయమే అయినప్పటికీ సామాన్యులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అయితే అదే క్రమంలో సామాన్యులతో పాటు…..ఎన్నో పరిశ్రమల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు సమాచారం….అందులో ముఖ్యంగా సినిమా పరిశ్రమ వాళ్ళు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు అనే చెప్పాలి…వలం ఫైనాన్స్ వ్యాపారం అండతో నడిచే సినిమా రంగం ప్రస్తుంతం డబ్బు దొరకక తీవ్ర సంక్షోభంలో మునిగి పోయింది. ప్రతిరోజూ 20 సినిమాల షూటింగు లు జరగాల్సిన టాలీవుడ్ లో ప్రస్తుతం పది సినిమాల షూటింగ్ లు కూడా జరగడం లేదు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అదే క్రమంలో జూనియర్ ఆర్టిస్టులు, ఇతర కార్మికులకు రోజువారీ వేతనాలు చెల్లించాల్సి వచ్చిన కనీస నగదు నిర్మాతల వద్ద లేకపోవడంతో ఈ ఇబ్బంది రోజురోజుకూ పెరిగిపోతూ వస్తుంది…ఇదంతా నాణానికి ఒక పక్క అయితే మరో పక్క సినిమా థియేటర్స్ కూడా ఖాళీగా వెలవెలబోతున్నాయి. కనీస అవసరాలకే చిల్లర దొరకకపోవడంతో ప్రజలు సినిమాలకు ఇంకేం వెళ్తారు…అందుకే తాజాగా విడుదలయిన సినిమాలు అయితే కలెక్షన్స్ లేక డిజాస్టర్స్ గా మిగలాల్సి వచ్చింది. అయితే అదే క్రమంలో వచ్చే నెల మొదటి వారంలో విడుదల కాబోతున్న రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాను విడుదల చేయాలా లేదంటే మళ్ళీ వాయిదా వేయాలా అన్న ఆలోచనల మధ్య మెగా కాంపౌండ్ అంతర్మధనంలో ఉన్నట్లు సమాచారం. చూద్దాం మరి మెగా ఫ్యామిలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.