టాలీవుడ్ లో ప్రతీ సినిమాపై ఏదో ఒక వర్గం తమ ప్రతాపం చూపించడం షరా మామూలు అయిపోయింది. మనిభావాలు అన్న పదానికి అర్ధం ఏంటో తెలియని వాళ్ళు కూడా తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ రోడ్డు ఎక్కి మరీ హడావిడి చేస్తూ వస్తున్నారు. అయితే సినిమా అంటే వినోధం, సినిమా అంటే కల్పితం అన్న ఆలోచనను మాత్రం మరచిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వర్గం డీజె సినిమాపై మంచి ఫైర్ లో ఉంది. సినిమాపై ఎన్నో ఆంక్షలు విధించి తమ మాట దక్కించుకుంది. కాస్త విషయంలోకి వెళితే…ఈ సినిమాలో గుడిలో బడిలో సాంగ్ తో బ్రాహ్మణ సంఘాలు గొడవ చేయడంతో… ఫైనల్ గా ఎలాగో ఆ పాటను మార్చి లిరిక్ విడుదల చేశారు. పోనీలే జరిగింది ఏదో జరిగింది ఆ సమస్య సమసిపోయింది అని అనుకుని ఊపిరి పీల్చుకుని రేపు సినిమా విడుదల కాబోతున్న తరుణంలో రిలీజ్ కు ఒక్కరోజు ముందు మళ్లీ డిజెకు బ్రాహ్మణ సంఘాలు భారీ షాక్ ఇచ్చారు.
అసలు ఏమయింది అంటే….రేపు రిలీజ్ అవనున్న డిజెలో హీరో క్యారక్టరైజేషన్ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని హైకోర్ట్ లో మరో కేసు వేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం…ఇదే కనుక జరిగితే మాత్రం…రేపు బన్ని డిజె రేపు రిలీజ్ అవ్వడం డౌటే అంటున్నారు. అంతేకాదు…ఏ కేసును హైకోర్ట్ లో విచారణకు స్వీకరిస్తే రేపు రావాల్సిన సినిమా వస్తుందా రాదా అన్నది అనుమానం మెగా అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మరి ఈ విషయంపై నిర్మాత, దర్శకులు ఏమైనా పట్టించుకుని సమస్యను క్లియర్ చేస్తారో లేక, కోర్ట్ లో తేల్చుకుందాం అని వదిలేస్తారో…అంతా సినిమా కొనుక్కున్న డిస్‌ట్రిబ్యుటర్స్ అదృష్టం పై ఆధార పడి ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.