Allu Arjun: బన్నీ చేసిన పని మెగాభిమానులకు నచ్చలేదా?

గంగోత్రి సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్ తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ నటుడిగా మరో మెట్టు ఎదగడంతో పాటు కమర్షియల్ గా భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరవుతున్న బన్నీ తాజాగా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై తన స్పీచ్ తో బాలయ్య ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.

అయితే బాలయ్యను ప్రశంసించేలా బన్నీ చేసిన కామెంట్లు మెగా అభిమానులను హర్ట్ చేస్తున్నాయి. గతంలో జై పవర్ స్టార్ అని చెప్పమంటే చెప్పను బ్రదర్ అంటూ కామెంట్లు చేసిన బన్నీ జై బాలయ్య అంటూ చేసిన కామెంట్ల గురించి మెగా గ్రూపులలో చర్చ జరుగుతోందని సమాచారం. చిరంజీవి ఆచార్య సినిమాను మొదట డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఆచార్య మేకర్స్ ప్రకటన చేయకముందే పుష్ప మేకర్స్ డిసెంబర్ 17వ తేదీన తమ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

పుష్ప రిలీజ్ డేట్ వల్ల మెగాస్టార్ చిరంజీవి హర్ట్ అయ్యాడని కామెంట్లు వినిపించాయి. బన్నీ ఓన్ ఇమేజ్ ను బిల్డ్ చేసుకునే దిశగా అడుగులు వేస్తుండటం మెగా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. పుష్ప పార్ట్1 సక్సెస్ సాధిస్తే బన్నీ క్రేజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా బన్నీ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus