గరికపాటిపై కామెంట్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ స్పందన ఇదే!

చిరంజీవి గరికపాటి వివాదం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదం విషయంలో ఎక్కువమంది చిరంజీవిని సమర్థించగా కొంతమంది గరికపాటిని సమర్థించారు. అయితే తాజాగా ఫోటోలు దిగే సమయంలో ఇక్కడ వారు లేరు కదా అంటూ గరికపాటిపై చిరంజీవి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ సైతం చిరంజీవినే సపోర్ట్ చేస్తున్నారు. ఈ కామెంట్ల విషయంలో చిరంజీవిని తప్పు పట్టాల్సిన అవసరం ఏముందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

చిరంజీవి ఎంతో అనుభవం ఉన్న హీరో అని గరికపాటి చేసిన కామెంట్ల విషయంలో గరికపాటిదే తప్పని తెలిసినా మంచి మనస్సుతో క్షమించారని ఫ్యాన్స్ చెబుతున్నారు. గరికపాటి పరువు తీసేలా చిరంజీవి ఎలాంటి కామెంట్ చేయలేదని అవతలి వాళ్ల కామెంట్ల వల్ల ఇబ్బంది పడ్డాననే విషయాన్ని మాత్రమే ఆయన వెల్లడించారని ఫ్యాన్స్ చెబుతున్నారు. చిరంజీవి సరదాగా మాత్రమే కామెంట్లు చేశారే తప్ప ఎవరినీ విమర్శించాలని కాదని ఫ్యాన్స్ వెల్లడించారు.

చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి అని సంస్కారం ఉన్న వ్యక్తి అని ఇతరులను ఇబ్బంది పెట్టాలని ఆయన అస్సలు అనుకోరని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా చిరంజీవి తర్వాత సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

ఒక్కో సినిమాకు చిరంజీవి 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. త్వరలో చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు చిరంజీవి ఎక్కువగా అవకాశాలను ఇస్తుండటం గమనార్హం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus