Mega Moment: మెగా అభిమానులకు మంచి కిక్ ఇచ్చే పిక్.. పవన్ అభిమానులే కాదు మెగా అభిమానులంతా హ్యాపీ!

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..ల వివాహం నిన్న ఇటలీలోని టస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఘనంగా జరిగింది. నవంబర్ 1 న పెళ్లి అయితే.. నాలుగైదు రోజుల ముందే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి చేరుకున్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ల వివాహం ఇరు కుటుంబ సభ్యులు, అలాగే కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులందరూ ఇటలీలో పెళ్లి పనులు మొదలు పెట్టిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ కూడా తన భార్యతో కలిసి ఇటలీ వెళ్ళినప్పుడు ఎయిర్ పోర్ట్ లో తీసిన ఫోటోలు కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి. అలాగే అక్టోబర్ 30 నుండి వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30 న .. కాక్ టెయిల్ పార్టీ ని హోస్ట్ చేశారు. అలాగే నిన్న అక్టోబర్ 31 న హల్దీ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఇదిలా ఉండగా..

వరుణ్- లావణ్య.. ల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పిక్స్ చూసిన నెటిజెన్లలో.. కొంతమంది కంప్లైంట్ చేసింది ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోటోల్లో కనిపించలేదు అని..! ఎప్పుడూ పవన్ అంత జాలిగా జల్సాలు చేసే బ్యాచ్ కాదు కాబట్టి.. రూమ్లో ఒక్కడే కూర్చుని ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయపడ్డారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా ఫ్యామిలీతో కలిసి ఉన్న ఓ ఫోటో బయటకి వచ్చింది. ఇది (Mega Moment) మెగా అభిమానులకు కూడా మంచి ఫీస్ట్ ఇస్తుంది అని చెప్పొచ్చు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus