సత్యదేవ్ (Satya Dev) హీరోగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జీబ్రా’ (Zebra). ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. నవంబర్ 22న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకని ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హాజరయ్యారు. దీంతో సత్యదేవ్ చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. సత్యదేవ్ మాట్లాడుతూ.. ” ‘గాడ్ ఫాదర్’ (God Father) సినిమా షూటింగ్ టైంలో వీడు చిరంజీవికి విలన్ ఏంటి? ఇలా సెట్లోకి వచ్చేస్తున్నాడు ఏంటి? అన్నారు.
Chiranjeevi
నాకు అప్పుడు భయమేసింది. కానీ చిరంజీవి అన్నయ్య ‘నన్ను నమ్ము’ ఈ సినిమాలో నాకు నువ్వు విలన్ గా చేయడం వల్ల ఇంకో పది మందికి తెలుస్తావు అన్నారు. ఆయన చెప్పింది ‘జీబ్రా’ తో జరిగింది. గాడ్ ఫాదర్ చేయడం వల్లే నిర్మాతలు నాతో జీబ్రా చేయడానికి వచ్చారు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఇక చిరంజీవి మాట్లాడుతూ.. “కొన్ని కొన్ని ఫంక్షన్స్ కి రావడానికి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది.
ప్రేమగా నన్ను పిలుస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది. కోవిడ్ టైంలో జనాలు ఓటీటీలకి అలవాటు పడిపోయారు. థియేటర్లకు పెద్ద సినిమాలకి, పెద్ద బడ్జెట్ సినిమాలకి మాత్రమే వస్తారు లేకపోతే రారు అని అంతా అనుకున్నారు. దీంతో నాకు కూడా భయమేసింది. చిన్న సినిమాలు ఆడినప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుంది అని నేను అనుకుంటాను. నా నమ్మకం ఈ ఏడాది నిజమైంది. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తీసిన ‘హనుమాన్’ (Hanu Man) పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యింది.
అలాగే సిద్ధు (Siddu Jonnalagadda) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square), నిహారిక (Niharika) తీసిన ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) , ‘ఆయ్’ (AAY) వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యింది. ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) సినిమాని అయితే రెండు సార్లు చూశాను. వాటిలానే సత్య చేసిన ఈ ‘జీబ్రా’ కూడా సూపర్ హిట్ అవుతుంది. నాకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. సత్య నాకు మూడో తమ్ముడు లాంటివాడు. అతని మాటల్లో స్వచ్ఛత ఉంటుంది.” అంటూ చెప్పుకొచ్చారు.