Vijay Devarakonda: అవును పడ్డాను.. ట్రోలర్స్ కు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!
- November 11, 2024 / 09:43 PM ISTByFilmy Focus
వరుస బాక్సాఫీస్ హిట్స్ తో స్టార్ స్టేటస్ అందుకున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), తన ప్రత్యేకమైన స్టైల్ తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ వార్తల్లో ఉంటాడు. అయితే ఇటీవల తన కెరీర్ లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న విజయ్, ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో కొందరు అతని ఫెయిల్యూర్స్ ను టార్గెట్ చేస్తూ, విభిన్న రకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా, విజయ్ ఒక ఈవెంట్ కు వెళ్తూ మెట్ల పై నుంచి కాలు జారి కింద పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Vijay Devarakonda

ఈ చిన్న ఘటనను చూసిన ట్రోలర్స్ మళ్ళీ విజయ్ ను టార్గెట్ చేస్తూ, వినోదభరితంగా ట్రోలింగ్ చేశారు. ఇది ఫ్యాన్స్ కు ఆగ్రహం కలిగించినప్పటికీ, విజయ్ తన స్టైల్ లో ఈ ట్రోలింగ్ పై స్పందించాడు. విజయ్ దేవరకొండకు తనకంటూ ప్రత్యేకత కలిగిన క్లాత్ బ్రాండ్ రౌడీ వేర్ ఉన్న విషయం అందరికీ తెలుసు. ఈ ట్రోలింగ్ పై విజయ్ తన రౌడీ వేర్ ప్రొమోషన్ ను ఉపయోగిస్తూ, “అవును పడ్డాను.. అదే జీవితం.

ఎత్తుపల్లాలకు అతీతంగా రౌడిలు దూసుకెళ్తారు” అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. ఈ మాటలతోనే ట్రోలర్స్ కి విజయ్ తగిన శైలిలో సమాధానం ఇచ్చినట్టైంది. విజయ్ ఇలా తన ఫ్యాన్స్ కు, రౌడీ వేర్ బ్రాండ్ ప్రేమలో పడతారు అంటూ రాసిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ విజయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం, విజయ్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తుండగా, రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) తో మరో సినిమా లైన్‌లో ఉంది. ఇవే కాకుండా చర్చల్లో ఉన్న మరికొన్ని ప్రాజెక్టులపై విజయ్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.












