నందమూరి బాలకృష్ణ, మెగా స్టార్ చిరంజీవి వీళ్ళిద్దరూ దాదాపుగా 80వ దశకంలో సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసి మంచి సినిమాలో, సహజసిద్దమయిన క్యారెక్టర్స్ తో టాప్ హీరోలుగా ఎదిగారు. ఇక ఇందులో బాలయ్య విషయమే తీసుకుంటే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావుగారి తనయుడిగా, ఆయన సినీ ప్రస్థాన వారసుడిగా టాలీవుడ్ లో ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా చక్రం తిప్పుతూ ఉండగా, ఇక చిరు మాత్రం స్వయంగా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పరోక్షంగా అల్లు వంశం వారి మద్దతుతో టాప్ హీరో ఎదిగాడు. అయితే ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్ళడం, చేతులు కాల్చుకోవడం, మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టడం అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే అనంతపురం లేపాక్షి ఉత్సవాల ఆహ్వానం నేపధ్యంలో బాలయ్య చిరుపై చేసిన కామెంట్స్ సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య వైరానికి దారి తీసాయి. ఈ ఉత్సవాలకి చిరుని ఆహ్వానించారా అని మీడియా సోదరులు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో ఎవర్ని పడితే వారిని నెత్తిన పెట్టుకోనని చిరుని అనుసరిస్తూ బాలయ్య అనడం, చిరు అభిమానులకు కోపం తెప్పించింది. ఇక దీనిపై బాలయ్యను ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ఉండగా, బాలయ్య అభిమానులు సైతం ధీటుగానే కౌంటర్స్ ఇస్తున్నారు…
సెంట్రల్ టూరిసమ్ మినిస్టర్ గా ఉన్న చిరు ఆయన పదవి కాలంలో రాష్ట్రానికి, రాష్టా టూరిసమ్ కు ఏం చేసాడని అతన్ని ఈ ఉత్సవాలకి పిలవాలి అంటూ నందమూరి అభిమానులు చెలరేగిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య అభిమానుల ఆలోచనకు అర్ధం ఉంది కానీ, ఇలాంటి సంధర్భాల్లో బాలయ్య కాస్త ఆలోచించి స్పందించడం మంచిది అనేది విశ్లేషకుల భావన. ఎందుకంటే బాలయ్య ఇప్పుడు హీరో మాత్రమే కాదు, ప్రజా ప్రతినిది కూడా. ఏది ఏమైన….నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య వార్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.