మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. సినిమా పై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. చరణ్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం మే 13న విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా.. మొన్న ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ కు వచ్చిన చిరంజీవి.. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ చిత్రం కంటే ముందే..
మోహన్ రాజా డైరెక్షన్లో ‘లూసీఫర్’ అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాళం’ రీమేక్లో నటించడానికి కూడా మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవి రెండు పూర్తయ్యాక బాబీతో సినిమా ఉంటుందన్న మాట. అంతేకాదు మధ్యలో గోపీచంద్ మలినేనితో తమిళ సూపర్ హిట్ మూవీ ‘ఎన్నై ఆరిందాల్’ రీమేక్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ‘వేదాళం’ చిత్రం రీమేక్ పూజా కార్యక్రమాలను మార్చి లేదా ఏప్రిల్ లో నిర్వహించి మరోపక్క ‘లూసిఫర్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలుపెట్టాలని చిరు భావిస్తున్నారట.
సాధ్యమైతే ఒక షెడ్యూల్ ను ఫినిష్ చేసి.. ‘ఆచార్య’ ప్రమోషన్లను మొదలుపెడతారని తెలుస్తుంది. అవి ముగిసాక నాన్ స్టాప్ గా ‘లూసిఫర్’ రీమేక్ షూటింగ్లో పాల్గొనాలని… 2022 సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చిరు బలంగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు.. మరోపక్క బాబీ ప్రాజెక్టుని కూడా 2021 ఎండింగ్లో మొదలుపెట్టేసి.. దాని షూటింగ్లో కూడా పాల్గొనాలని చిరు ప్లాన్ చేసుకుంటున్నారట.వయసు 60 దాటినా మెగాస్టార్ ఎనర్జీ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి.