Chiranjeevi: మెగాస్టార్ ఇంటర్ ఘనంగా వినాయక చవితి సంబరాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

వినాయక చవితి పండుగ సందర్భంగా రెండు రాష్ట్రాలలో ప్రజలు సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున వినాయక చతుర్థి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇకపోతే ఏదైనా పండుగ వచ్చినా ప్రత్యేక రోజు వచ్చిన మెగా కుటుంబం పెద్ద ఎత్తున ఆ వేడుకను సెలబ్రేట్ చేసుకొని అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే వినాయక చవితి పండుగను కూడా మెగా ఫ్యామిలీ ఎంతో ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ దంపతులు వినాయక చవితి పూజను ఎంతో ఘనంగా నిర్వహించారు. అలాగే తన కూతురు శ్రీజ మనవరాలు నవిష్క చిరంజీవి తల్లి అంజనదేవి సైతం పూజలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇకపోతే వినాయక చవితి పండుగ సందర్భంగా తన మనవరాలు నవిష్క చేసిన పనికి చిరంజీవి ఎంతగానో మురిసిపోతూ తన మనవరాలుని ముద్దాడాడు.పూజ అనంతరం పురోహితులు చెప్పిన మంత్రాలను శ్రీజ కుమార్తె నవిష్క ఎంతో స్పష్టంగా పలకడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా నవిష్క పురోహితులు చెప్పిన మంత్రాలను పలకడంతో చిరంజీవి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టడమే కాకుండా తన మనవరాలి పై ముద్దుల వర్షం కురిపించారు.

సాధారణంగా పురోహితులు చదివే మంత్రాలు చదవాలంటే కొన్నిసార్లు పెద్దవారికి కూడా పలకడం రాదు అలాంటిది నవిష్క మంత్రాలను చాలా స్పష్టంగా పలకడంతో చిరంజీవి ఎంతో మురిసిపోయారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే గాడ్ ఫాదర్, భోళాశంకర్ వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

1

2

3

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus