Chiranjeevi: పార్టీ ఇచ్చిన చిరంజీవి.. కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా!

మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ కు మరో 9 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరగగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆ అంచనాలు మరింత పెరగడంతో పాటు సినిమా గురించి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుందని చిరంజీవి భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాను చూసిన చిరంజీవికి ఈ సినిమా ఎంతగానో నచ్చేసిందని సమాచారం అందుతోంది.

ఆచార్య, గాడ్ ఫాదర్ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయినా వాల్తేరు వీరయ్య మూవీ విషయంలో ఆ తప్పు అస్సలు జరగదని చిరంజీవి ఫిక్స్ అయ్యారని బోగట్టా. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా చిరంజీవి తన సన్నిహితులతో పాటు వాల్తేరు వీరయ్య యూనిట్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. చిరంజీవితో పాటు ఈ సినిమాను చూసిన వాళ్లు వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అని కామెంట్ చేశారని ఆ కామెంట్ చిరంజీవికి ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలుస్తోంది.

సినిమా రిలీజ్ కు ముందే సక్సెస్ సెలబ్రేషన్ అనే విధంగా పార్టీ ఇచ్చారంటే 2023 సంక్రాంతికి మెగాస్టార్ ఖాతాలో హిట్ చేరినట్టేనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీన రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఓవర్సీస్ లో ఇప్పటికే వాల్తేరు వీరయ్య మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. వాల్తేరు వీరయ్య రిజల్ట్ విషయంలో చిరంజీవి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దర్శకుడు బాబీ కూడా చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలనే కసితో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించి చిరంజీవి కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus