Chiranjeevi: మొన్న నాగబాబు, నేడు చిరంజీవి సాయం.. కన్నీంటిపర్యంతమైన నటి పాకీజా..

సినిమా పరిశ్రమలో ఒకప్పుడు మంచి స్టార్ స్టేటస్ అనుభవించి, ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతున్న సీనియర్ నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన దీన గాధలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరికి అవసరమైన సాయమందితే.. మరికొందరు ఇంకా సాయం చేసే వారికి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇటీవల నటి పాకీజా ప్రస్తుత పరిస్థితి గురించి వార్తలు వైరల్ అయ్యాయి.. తమిళనాడులోని కారైకుడికి చెందిన పాకీజా అసలు పేరు వాసుకి. పాకీజాగా తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె.

ప్రస్తుతం వయసు పై బడడంతో పాటు పేదరికంతో ఓ హాస్టల్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారామె. పలువురు పాకీజాకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పాకీజా వీడియో చూసి మెగా బ్రదర్ నాగబాబు చలించిపోయారు. తన వంతు ఆమెకు ఓ లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా పాకీజాకు తనవంతు సాయమందించారు.. పాకీజాకు ఆర్థికంగా సాయపడాలని నిర్ణయించుకున్నారు. ఆమెకు లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. తెలుగు సినిమాలు,

బుల్లితెర సీరియల్స్ లో పాకీజాకు ఒక పాత్ర ఇచ్చి ఆమె ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సాయపడాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. చిరంజీవితో ఒక్క సినిమాలో కూడా నటించకపోయినా నాగబాబు, చిరంజీవి ఆర్థికంగా ఆదుకోవడంపై పాకీజా భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘పాకీజాగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఒక ఆర్టిస్టు ఇప్పుడు ఇలా కష్టాల్లో ఉండటం బాధగా ఉంది. బుల్లితెర కానీ, సినిమాల్లో కానీ.. చిన్నదో పెద్దదో ఒక పాత్ర ఆవిడకు ఇచ్చి మళ్లీ తన కాళ్ల మీద తాను నిలబడేందుకు పరిశ్రమ వారు సాయపడాలి. నావంతు ప్రయత్నం కూడా చేస్తాను’’ అన్నారు నాగబాబు..

ఇటీవల నాగబాబు, వాసుకితో వీడియో కాల్‌లో మాట్లాడారు. నాగబాబు సాయం చేశారని తెలుసుకున్న పాకీజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎదురుగా ఉంటే నాగబాబు కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తమిళ్‌లో అన్ని సినిమాలు చేసినా ఏ ఒక్కరూ ఒక్క వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదని.. ఇప్పుడు ఒక ముద్దు తింటున్నానంటే అది తెలుగు వాళ్లు పెట్టిన భోజనమే అంటూ వాసుకి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus