టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండస్ట్రీకి నటనపై ఆసక్తితో ఎంతోమంది కొత్త హీరోలు దర్శక నిర్మాతలు వస్తున్న నేపథ్యంలో ఆయన వారిని ఎంకరేజ్ చేస్తూనే వారికి సినిమా పట్ల సలహాలు ఇస్తూ ప్రస్తుత ఇండస్ట్రీలో ఉన్నటువంటి దర్శకులకు కూడా తనదైన స్టైల్ లో క్లాస్ పీకారు.
ఈ సందర్భంగా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ బాగుండాలంటే అంత దర్శకుల చేతిలోనే ఉందని దర్శకులే చిత్రపరిశ్రమను ముందుకు నడిపించగలరని పేర్కొన్నారు. దర్శకులు కంటెంట్ పై ఫోకస్ చేయకుండా కాంబినేషన్లు సినిమా విడుదల పై ఫోకస్ చేస్తూ హడావిడిగా సినిమాలు చేస్తున్నారని, సినిమాలో కంటెంట్ లేకపోతే కాంబినేషన్ తో పనిలేదని ఈ సందర్భంగా ఈయన తెలియచేశారు.
సినిమాలో కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారని లేదంటే నిర్మొహమాటంగా ఆ సినిమాను తిరస్కరిస్తారని, మెగాస్టార్ తెలియజేయడమే కాకుండా అందుకు నేను కూడా బాధితుడినే అంటూ ఆచార్య సినిమా ఫ్లాప్ విషయం గురించి ఈయన మాట్లాడారు. ఇలా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ విషయం నుంచి మెగాస్టార్ బయటపడలేక ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తూ ప్రస్తుత దర్శకులకు నిర్మాతలకు సలహాలతో పాటు చురకలు వేశారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు కొరటాల శివను ఉద్దేశించి చేశారని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి డైరెక్టర్ల గురించి ప్రస్తావిస్తూ కథపై దృష్టి పెట్టి సినిమాని, సినీ పరిశ్రమను ముందుకు నడిపించే బాధ్యత పూర్తిగా డైరెక్టర్ పైనే ఉందంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.