Chiranjeevi Workout: విశ్వంభర కోసం జిమ్ లో భారీగా కష్టపడుతున్న మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన త్వరలోనే విశ్వంభర సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు. బింబిసారా సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వశిష్ట దర్శకత్వంలో తెరకేక్కబోతున్నటువంటి ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం చిరంజీవి కూడా భారీ స్థాయిలో వర్కౌట్స్ చేస్తూ తనని తాను సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉన్నటువంటి వీడియోని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా చాలా కఠినమైనటువంటి వర్కౌట్స్ చేస్తూ ఈయన కనిపించారు. గెట్టింగ్ రెడీ ఫర్ విశ్వంభర అంటూ చెప్పుకోవచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈ వీడియో పై తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వయసులో కూడా ఇలాంటి వర్కౌట్స్ ఏంటన్నా అందుకే మిమ్మల్ని (Chiranjeevi) మెగాస్టార్ అనేది అంటూ ఈయన వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆరుపదుల వయసు దాటుతున్నటువంటి తరుణంలో ఇలా యంగ్ హీరోలతో సమానంగా ఈయన వర్కౌట్స్ చేస్తూ కనిపించడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus