Acharya Movie: మెగాఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. చిరు సినిమా లేనట్లే!

కరోనా కారణంగా సినిమాలన్నీ వాయిదా పడుతూనే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలు ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ ఇలా ఒక్కో సినిమా వాయిదా పడుతున్నట్లు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో ‘ఆచార్య’ సినిమా కూడా చేరినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీకి వస్తుందనుకున్న ఆచార్య సినిమాను వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది ‘ఆచార్య’ టీమ్. ‘కరోనా, ఒమిక్రాన్‌ దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆచార్య మూవీని వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌తో మీ ముందుకు వస్తాం. అందరికి హ్యాపీ సంక్రాంతి. కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాం’ అంటూ ట్వీట్ లో పేర్కొంది చిత్రబృందం. ఈ చిత్రంలో చిరంజీవి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. రామ్ చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో నిరంజన్ రెడ్డి,

అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రెజీనా కసాండ్ర, సంగీత స్పెషల్ సాంగ్స్‌లో అలరించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus