మగబిడ్డకు జన్మనిచ్చిన మేఘనా రాజ్..!

కన్నడ హీరో చిరంజీవి షార్జా 36 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అంత చిన్న వయసులోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడని ఎవ్వరూ అనుకోలేదు.దీంతో ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీ మొత్తం షాకయ్యింది. ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసాడు చిరంజీవి షార్జా. అయితే ఆయన పోయే ముందు అతని భార్య మేఘన రాజ్ గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి కుటుంబ సభ్యులు ఆమె పట్ల చాలా జాగ్రత్త వహించారు.

కొద్దిరోజుల తరువాత చిరంజీవి సర్జా కటౌట్ పెట్టి.. సీమంతం జరిపించారు. చిరంజీవి షార్జా తమ్ముడైన ధృవ్ షార్జా.. ఎన్నో సార్లు ‘తన అన్న మళ్ళీ పుడతాడు’ అంటూ ఆశాభావం వ్యక్తం చేసాడు. అతను అన్నట్టుగానే మేఘనా రాజ్ తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం విశేషం. దాంతో కుటుంబ సభ్యులు అలాగే చిరంజీవి షార్జా ఫ్యాన్స్ మరియు చిరంజీవి షార్జా సోదరుడు ధృవ్ షార్జా.. ఎంతో సంతోషపడుతున్నట్టు కామెంట్ చేశారు.

తన అన్నయ్య లేకపోయినప్పటికీ వదిన అయిన మేఘనను తల్లిలా చూసుకుంటానని కూడా ధృవ్ తెలిపాడు. ఇంకో విశేషం ఏమిటంటే..చిరంజీవి షార్జా, మేఘనా రాజ్ ల ఎంగేజ్మెంట్ డే కూడా ఈరోజే.!

1

2

3

4

5

6

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.