చిరంజీవి శ్రీమతి శ్రీమంతం మూడు సార్లు జరిగింది!

దివంగత కన్నడ కథానాయకుడు చిరంజీవి సర్జా శ్రీమతి, గతంలో కథానాయికగా తెలుగులోనూ కొన్ని చిత్రాలలో నటించిన మేఘనా రాజ్ శ్రీమంతం ఘనంగా జరిగింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీమంతంలో చిరంజీవి కటౌట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గుండెపోటుతో కొన్ని రోజుల క్రితం మరణించిన చిరంజీవి మళ్ల తిరిగి వచ్చినట్లు అనిపించిందని చాలామంది అన్నారు. శ్రీమంతంలో చిరంజీవి లైఫ్ సైజ్ కటౌట్ పెట్టాలనే ఐడియా తన ఫ్రెండ్ పన్నగా భరన ఐడియా అని మేఘనారాజ్ తెలియజేశారు.

ఆ కటౌట్ చూడగానే ఎమోషనల్ అయ్యానని ఆమె అన్నారు. భర్త మరణించిన తర్వాత తొలిసారి మీడియాతో మేఘనా రాజ్ మాట్లాడారు. తాను శ్రీమంతాన్ని వేడుకగా చేసుకోవాలని అనుకోలేదని, కానీ అలా జరిగిందని ఆమె తెలియజేశారు. చిరంజీవి జీవించి ఉన్నప్పుడు శ్రీమంతం ఎలా సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని మేఘనారాజ్ తో డిస్కస్ చేశారు. సెలబ్రేషన్స్ వెన్యూ గురించి కూడా డిస్కషన్స్ వచ్చాయి. చిరంజీవి ఎక్కడ ఎక్కడ చేస్తే బాగుంటుందని అనుకున్నారో‌… అక్కడ అక్కడ శ్రీమంతాన్ని జరిపించారు.

ఇంట్లో సాంప్రదాయం ప్రకారం ఒకసారి, రెండుసార్లు హోటల్స్ లో జరిగాయి. చిరంజీవి తమ్ముడు, హీరో ధ్రువ్ సర్జా హోటల్ లో ఘనంగా వేడుకగా చేశాడని మేఘనారాజ్ ‌ అన్నారు.

1

2

3

4

5

6

7

8

9

 

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Share.