స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు పురాణాలపై మంచి పట్టు ఉంది. గతంలో ఆయన పలు సినిమా వేడుకల్లో ఇచ్చిన స్పీచ్ లను గమనిస్తే ఇది అందరికీ అర్థమవుతుంది. అయితే పురాణాల పై ఇంత నాలెడ్జ్ పెట్టుకుని కూడా త్రివిక్రమ్ ఒక పాన్ ఇండియా సినిమా చేయలేకపోయాడు. ఈ మధ్య పురాణాలను టచ్ చేస్తూ వచ్చిన పాన్ ఇండియా సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ‘కల్కి 2898 AD’ తర్వాత వాటి హవా మరింత పెరిగింది.
ఈ క్రమంలో త్రివిక్రమ్ కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యారు. మొదట అల్లు అర్జున్ తో అనుకున్న ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి వెళ్ళింది.త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా వెంకటేష్ తో చేయబోతున్నారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ‘విడిపోయిన కుటుంబం.. దానిని కలిపే హీరో’ వంటి ఫ్యామిలీ లైన్స్ ను పక్కన పెట్టి త్రివిక్రమ్ చేయబోతున్న సినిమా కావడంతో అందరికీ ఆసక్తి పెరిగింది.
కానీ ఈ ప్రాజెక్టు విషయంలో త్రివిక్రమ్ ఎక్కువ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం వి.ఎఫ్.ఎక్స్ అని తెలుస్తుంది. దాని విషయంలో త్రివిక్రమ్ కి అస్సలు ఐడియా లేదు. మైథాలజీ సబ్జెక్ట్, అందులోనూ పాన్ ఇండియా అటెంప్ట్ కాబట్టి కచ్చితంగా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఎక్కువగానే ఉంటుంది.
ఈ మధ్య వి.ఎఫ్.ఎక్స్ తో లింక్ అయిన సినిమాలకి ఎక్కువ టైం పట్టేస్తుంది. ‘విశ్వంభర’ ‘ది రాజాసాబ్’ వంటి సినిమాలు వీటి వల్లే రిలీజ్ కి ఇబ్బంది పడుతున్నాయి. అందుకే త్రివిక్రమ్.. ఓ కొత్త టీంను పెట్టుకుని అవసరం అయితే ఇంకాస్త ఎక్కువ టైం తీసుకుని ‘అంతా పర్ఫెక్ట్’ అనుకున్న తర్వాతే సెట్స్ పైకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.