పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా మరో 3 కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి టైంలో ఆయన సినిమాల్లో నటించడం సాధ్యమయ్యే విషయం కాదు. కానీ నిర్మాతలు తనను నమ్మి కోట్లు పెట్టుబడి పెట్టేశారు. దర్శకులు కూడా తమ విలువైన సమయాన్ని పవన్ సినిమాలకి కేటాయించారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక్కసారి మాట ఇస్తే తప్పే రకం కాదు.
అందుకే పెండింగ్లో ఉన్న 3 సినిమాలకి డేట్స్ ఇచ్చేశారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. జూలై 24న విడుదల కానుంది ఈ సినిమా. ‘ఓజి’ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి బ్యాలెన్స్ ఉంది. అది ఈ ఏడాది కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ సినిమాకు కూడా బల్క్ డేట్స్ ఇచ్చేశారు.
పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ సినిమాని శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ 3 షెడ్యూల్స్ కంప్లీట్ చేసేశాడు హరీష్. ఈ మధ్యనే బి.హెచ్.ఇ.ఎల్ పరిసరాల్లో ఉన్న పోలీస్ గ్రౌండ్స్ లో ఓ మానిటైజ్ సాంగ్ ను పిక్చరైజ్ చేశారు. శ్రీలీల, పవన్..ల పై ఈ సాంగ్ చిత్రీకరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కాల్షీట్స్ వాల్యూ అర్థం చేసుకుని హరీష్ శంకర్ సినిమాని పరుగులు పెట్టిస్తున్నాడట.
సింగిల్ టేక్లోనే చాలా సన్నివేశాలు ఓకే చేసేస్తున్నాడట. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకుని హరీష్ సీన్స్ రాస్తూ ఉంటాడు. ఫాస్ట్ గా తీయగలడు కూడా. ‘ఉస్తాద్..’ విషయంలో ఆ పద్ధతినే ఫాలో అవుతున్నాడట. ఫ్యాన్ బాయ్ అంటే ఇలా ఉండాలి. హరీష్ స్పీడ్ చూస్తుంటే 2025 ఎండింగ్ కి షూటింగ్ మొత్తం ఫినిష్ చేసేలా ఉన్నాడు.