చిరంజీవి సర్జా కుటుంబానికి మరో సమస్య!

కన్నడ హీరో చిరంజీవి సర్జా ఈ ఏడాది జూన్ 7న గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. దీంతో అయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిరంజీవి చనిపోయే సమయానికి అతడి భార్య మేఘనా రాజ్ గర్భవతి. భర్త మరణాన్ని ఆమె జీర్ణించుకోలేక, ఆ బాధ నుండి బయటపడలేకపోయింది. కానీ అతడి జ్ఞాపకాలు తనను సజీవంగా నిలిపాయని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ లో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు వీరి కుటుంబానికి మరో సమస్య వచ్చింది.

ఫ్యామిలీ మొత్తం కోవిడ్ బారిన పడ్డారు. మేఘనా రాజ్ తో పాటు ఆమె తల్లి, తండ్రులకు, రెండు నెలల తన పసికందుకి కూడా కోవిడ్ సోకడం షాకిస్తుంది. ఈ విషయాన్ని మేఘనా స్వయంగా వెల్లడించింది. మంగళవారం నాడు ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఒక ప్రకటన షేర్ చేసింది. ఆ ప్రకటనలో తనతో పాటు, తన కుమారుడుకి, తల్లితండ్రులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. గత కొన్ని వారాలుగా తమని కలిసి వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం కుటుంబం మొత్తం ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని తెలిపింది.

జూనియర్ చిరు ఆరోగ్యం బాగానే ఉందని.. అన్ని వేళలా తనతో ఉంటున్నానని.. కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పింది. కరోనా మహమ్మారిపై యుద్ధంలో తప్పకుండా గెలుస్తామంటూ నమ్మకంగా చెప్పుకొచ్చారు. కానీ ఈ వార్త మాత్రం చిరు అభిమానులు బాధ పెడుతోంది. చిరంజీవి సర్జా కుటుంబానికి ఒకదాని తరువాత ఒకటి అన్నట్లు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.