Katrina Wedding: బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ పెళ్లి గురించి మరో రూమర్‌!

స్టార్‌ హీరోల సినిమాకు వస్తున్నంత బజ్‌, పుకార్లు, చర్చలు… విక్కీ కౌశల్‌, కట్రినా కైఫ్‌ పెళ్లి విషయంలో వస్తున్నాయి అంటే నమ్మగలరా. తమ పెళ్లి పూర్తి ప్రైవేటు కార్యక్రమం అని కొత్త జంట భావించి ఎవరికీ ఏమీ చెప్పకుండా ముందుకెళ్తున్నారు. అయితే కొన్ని వివరాలు బయటకు లీకవుతున్నాయి. అందులో భాగంగా పెళ్లికి వచ్చేవారి మీద పెట్టిన ఆంక్షల లిస్ట్‌ తొలుత బయటకు వచ్చింది. ఇప్పుడు ఫుడ్‌ మెనూ వివరాలు ఇవే అంటూ ఓ లిస్ట్‌ బయటకు వచ్చింవది.

డిసెంబరు 9న రాజస్థాన్లో సిక్స్‌సెన్సెస్‌ ఫోర్ట్‌లో విక్కీ – కట్రినా పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే పెళ్లి పనులు కొలిక్కి వచ్చాయట. ప్రస్తుతం ఈ జంట ఫుల్‌ పెళ్లి మూడ్‌లో ఉంది. సంగీత్, హల్దీ సంబరాలు జరుగుతున్నాయట. పెళ్లితోపాటు మూడు రోజులు జరగనున్న ఈ వేడుక కోసం అతిథులకు అదిరిపోయే భోజనాలు ఏర్పాటు చేశారట. కర్ణాటక, తమిళనాడు, ముంబయి, దిల్లీ, చండీగఢ్… తదితర ప్రాంతాల నుండి కూరగాయలు, మసాలాలు, ఇతర దినుసులు, మిఠాయిలను… లారీల కొద్దీ పెళ్లి వేడుక వేదిక వద్దకు తరలించారట.

విక్కీ పంజాబ్‌కు చెందిన వాడు కాబట్టి… రోజూ పంజాబీ వంటకాల మెనూ ఉండేలా చూసుకున్నారట. రోటీలు, నాన్‌లు, చికెన్ టిక్కా, బటర్ చికెన్, ముఘలాయ్ మటన్ ఫ్రై, సరసో కి సాగ్, మచిలీ అమృత్సరి, బెంగాలీ స్వీట్స్, కొల్హాపురి చికెన్, దాల్ మకని, లెమన్ చికెన్, బాంబిల్, గలవాటి కబాబ్, నిహారి కుల్చ, బటర్ చికెన్, కడి పకోడీతోపాటు మలై పాన్‌ లాంటి ఆహార పదార్థాలు మెనూలో ఉన్నాయట. వీటికితోడు ఐస్ క్రీములు, పిజ్జాలు, చాట్లు, స్వీట్లు ఎలాగూ ఉంటాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus