యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీల్లో ‘ప్రాజెక్ట్ కె’ కూడా ఒకటి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ వంటి మిడ్ రేంజ్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్లోనే అత్యధికంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పాన్ వరల్డ్ మూవీగా ఇంటర్నేషనల్ వైడ్ ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కాబోతుంది.
అమితాబ్ బచ్చన్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలియజేశారు నిర్మాత అశ్వినీదత్. ‘ప్రాజెక్ట్ కె’ చిత్రానికి సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తయిందని.. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందని .. ఈ చిత్రంలో చాలా మంది పెద్ద ఆర్టిస్ట్ లు నటించారని.. దిశా పాటని కూడా ఈ మూవీలో నటించిందని,
రిలీజ్ కు ముందు మిగిలిన క్యాస్టింగ్ ను రివీల్ చేస్తామని నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మొదట మిక్కీ జె మేయర్ ను ఎంపిక చేసుకున్నారు. నాగ్ అశ్విన్ గత రెండు సినిమాలకు ఆయనే సంగీతం అందించాడు. చాలా మంచి మ్యూజిక్ అందించాడు కూడా..! అందుకే ‘ప్రాజెక్ట్ కె’ కి కూడా అతన్నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్టు మొదట తెలిపారు. అయితే సైలెంట్ గా అతన్ని ‘ప్రాజెక్ట్ కె’ నుండి తీసేసినట్టు తాజాగా అశ్వినీదత్ కామెంట్స్ ను బట్టి స్పష్టమవుతుంది.
‘ప్రాజెక్ట్ కె’ కి సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణన్ ను ఎంపిక చేసుకున్నారట. అలాగే ఓ బాలీవుడ్ అమ్మాయి కూడా సంగీతం అందించనుందని ఆయన తెలిపారు. సంతోష్ నారాయణన్.. ‘దసరా’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. తమిళంలో అతను టాప్ మ్యూజిక్ డైరెక్టర్. చూడాలి మరి ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో..!
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?