Miheeka, Rana: ఆ ఫోటోలతో పుకార్లకు చెక్ పెట్టిన మిహికా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి వారసుడిగా లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నటుడు రానా. ఈయన హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న రానా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే 2020 సంవత్సరంలో రానా మిహికా బజాజ్ అనే యువతిని ప్రేమించి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న వీరిద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ ఒక్కసారిగా వార్తలు షికార్లు చేశాయి.ఈ విధంగా వీరి గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం వీరి రెండవ వివాహ వార్షికోత్సవం రోజు రానా తన ఇంస్టాగ్రామ్ పోస్టులన్నీ డిలీట్ చేయడమే అని చెప్పాలి. ఈ విధంగా రానా తన రెండవ పెళ్లి రోజు ఇన్స్టాగ్రామ్ పోస్టులన్ని డిలీట్ చేయడంతో తన భార్యతో తనకు మనస్పర్ధలు వచ్చాయని అందుకే ఇలాంటి పోస్టులన్నీ డిలీట్ చేశారంటూ పలువురు పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరిచారు.

అలాగే ఈయన ట్విట్టర్ కి కూడా బ్రేక్ ఇవ్వడం అందరిని అనుమానాలకు దారితీసింది.అయితే రానా మిహికా గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో ఈ విషయంపై స్పందించిన రానా భార్య మిగతా ఈ వార్తలకు చెక్ పెట్టారు. ఈ క్రమంలోనే మెహిక తన సోషల్ మీడియా ద్వారా రాణాతో కలిసి దిగిన క్యూట్ అండ్ లవ్లీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ మధ్య ఎలాంటి గొడవలు రాలేదని పరోక్షంగా వెల్లడించారు.

అదేవిధంగా తన రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వెంకటేష్ కూతుర్లు అలాగే పలువురు తనకు శుభాకాంక్షలు తెలియజేసిన స్క్రీన్ షాట్లను కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒకసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విధంగా మిహిక తమ మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు రాలేదని చెప్పకనే చెప్పేశారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus