Priyanka Chopra: ప్రియాంక చోప్రాపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ మిస్ బార్బడోస్ !..

సెలబ్రిటీలు పబ్లిక్‌గా కామెంట్స్ చేస్తే ఇక అవి ఎంతలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. వాళ్ల కామెంట్స్‌తో రకరకాల ఫన్నీ మీమ్స్ చక్కర్లు కొడుతుంటాయి.. లేటెస్ట్‌గా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటంటే.. మిస్ బార్బడోస్ విన్నర్, మాజీ మిస్.. లిలానీ అనే మహిళ 20 ఏళ్ల క్రితం జరిగిన మిస్ ఇండియా పోటీల వ్యవహారాన్ని ఇప్పుడు బయటకి తీసి.. ప్రియాంక చోప్రా మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది.. అసలేం జరిగింది?.. వివరంగా చూద్దాం..

మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా వరుసగా రెండు సార్లు కిరీటాన్ని కైవసం చేసుకుంది.. 1999 లో యుక్తా ముఖి.. 2000 లో ప్రియాంక చోప్రా.. వీళ్లిద్దరూ మిస్ ఇండియాగా గెలవడానికి అప్పుడు ఆ ఈవెంట్‌కి స్పాన్సర్ షిప్ చేసిన రెండు ఇండియన్ సంస్థలే కారణం, అసలు ప్రియాంక చోప్రా పెద్ద అందగత్తేం కాదు.. తను రిగ్గింగ్ చేసి కిరీటం గెలుచుకుంది.. అంటూ లిలానీ కామెంట్స్ చేసింది.. ‘‘వాస్తవానికి ప్రియాంక చోప్రా పెద్ద అందగత్తె ఏం కాదు.. తను తోటి కంటెస్టెంట్స్‌తో కలిసి రిహార్సల్స్‌ కూడా చేయలేదు.

ఆమెను స్పెషల్ వీవీఐపీలా ట్రీట్ చేసేవారు. నచ్చిన ఫుడ్, డిజైనింగ్ డ్రెస్సెస్ అన్నీ తన రూమ్‌కే పంపేవారు.. పోటీలో పాల్గొనే మిగతా వారికి అలాంటి ఫెసిలిటీస్ ఏమీ ఉండేవి కావు.. తనను మాత్రమే తీసుకెళ్లి ఒంటరిగా బీచ్‌లో ఫోటో షూట్ చేసేవారు.. మమ్మల్ని మాత్రం గ్రూపులుగా తీశారు. ఇదంతా కావాలనే చేస్తున్నారనే సంగతి మాకు తెలిసినా వాళ్లని ఎదురు ప్రశ్నించలేని పరిస్థితి..

ప్రతి విషయంలో స్పాన్సర్ల ఫెవరేటీజం వల్ల మాకు అన్యాయం జరిగింది.. ఆ ఏడాది మిస్ వరల్డ్ పోటీలో అంతా ప్రియాంకకు అనుకూలంగా మార్చేసి, కిరీటాన్ని కట్టబెట్టారు.. ఇది జెన్యూన్‌గా గెలిచినట్లు ఎలా అవుతుంది?.. రిగ్గింగ్ చేసి మిస్ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకుంది’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మిస్ బార్బడోస్ లిలానీ. ప్రియాంక చోప్రా మీద ఈమె చేసిన ఆరోపణలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus