Missing Movie: పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న హర్ష నర్రా,శ్రీని జోస్యుల ల ‘మిస్సింగ్’ చిత్రం..!

తమ సినిమా పై ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే.. విడుదలకి ముందే ప్రీమియర్ షోలు వేసుకుంటూ ఉంటారు ఆయా చిత్ర యూనిట్ సభ్యులు. తాజాగా ‘మిస్సింగ్’ చిత్రం టీం కూడా అదే చేసారు. సినిమా పై వాళ్ళ కాన్ఫిడెన్స్ ను ఈ రకంగా ప్రూవ్ చేశారు. ‘బజరంగబలి క్రియేషన్స్’ బ్యానర్ పై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మాణంలో శ్రీని జోస్యుల దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘మిస్సింగ్’.హర్షా నర్రా హీరోగా నటించిన ఈ చిత్రంలో నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ లు హీరోయిన్లు.

సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ‘మిస్సింగ్’ చిత్రం… టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో నవంబర్ 19 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే విడుదల తేదీకి రెండు రోజుల ముందే ‘మిస్సింగ్’ ప్రీమియర్ షోని వేయడం దానికి మంచి రెస్పాన్స్ రావడం మరో విశేషంగా చెప్పుకోవాలి. ఇక ప్రీమియర్ షోకి విచ్చేసిన సెలబ్రిటీలంతా ‘మిస్సింగ్’ చిత్రం పై అలాగే ఈ మూవీ కోసం పనిచేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల పై ప్రశంసలు కురిపించారు.

ఏమాత్రం ల్యాగ్ అనేది లేకుండా ఆద్యంతం థ్రిల్లింగ్ గా మూవీ సాగిందని నటుడు శివబాలాజీ, జీవితా రాజశేఖర్, దర్శకుడు చందూ మొండేటి వంటి వారు కితాబిచ్చారు. ప్రీమియర్ షోకి పాజిటివ్ టాక్ రావడంతో రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ‘మిస్సింగ్’ చిత్రాన్ని వరుస విజయాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘ఏషియన్ సినిమాస్’ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తుండడం విశేషం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus