Mission Impossible: రికార్డులకు కేంద్ర బిందువుగా మారిన మిషన్ ఇంపాజిబుల్ 7

హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ కి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే కచ్చితంగా థియేటర్స్ లో మాత్రమే చూడాలి అని ఫిక్స్ అవుతారు ఆడియన్స్. ఎలాంటి డూప్ సహాయం లేకుండా ప్రాణాలకు తెగించి ఆయన చేసే రిస్కీ స్తంట్స్ ని చూస్తే ఎలాంటి వాడికైనా గూస్ బంప్స్ వచ్చేస్తాది. అసలు ఏమి మనిషి ఈయన, ఇలాంటి స్తంట్స్ ఎలా చెయ్యగల్తున్నాడు?, పొరపాటున ప్రాణాలు పోతే ? అని ఆయన చేసే స్తంట్స్ చూసే ప్రతీ ఒక్కరికి అనిపించే కామన్ విషయం.

ముఖ్యంగా ఆయన హీరో గా నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి మన ఇండియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. నిన్న ఈ సిరీస్ నుండి ‘మిషన్ ఇంపాజిబుల్ 7 : డెడ్ రికానింగ్ పార్ట్ 1 ‘ గ్రాండ్ గా విడుదలైంది. విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమాకి ఇండియా లో ఏకంగా 12 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. గ్రాస్ లెక్కలో ఒకసారి చూస్తే 20 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.

అలా ఇండియా లో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 7 హాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిల్చింది ఈ సినిమా. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే 150 మిలియన్ డాలర్లు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం చూస్తే 1200 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం.

గత ఏడాది విడుదలైన జేమ్స్ కెమరూన్ అవతార్ పార్ట్ 2 చిత్రం మొదటి రోజు 140 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యగా, మిషన్ ఇంపాజిబుల్ 7 మొదటి రోజు అవతార్ కంటే పది మిలియన్ డాలర్లు ఎక్కువ రాబట్టి సంచలనం సృష్టించింది. మరి ఫుల్ రన్ లో కూడా ఈ సినిమా అవతార్ ని దాటుతుందో లేదో చూడాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus