సినిమా హిట్ అయితే దర్శకుడి నుండి లేదంటే సినిమా టీమ్ నుండి ఏదైనా ఒక థ్యాంక్యూ లేఖ రావడం కామన్. ఇటీవల కాలంలో చెప్పాల్సిందంతా మైక్‌ల్లో చెప్పి ఊదరగొట్టినా.. మళ్లీ ఇంటికెళ్లి ఓ పెద్ద లేఖ రాసి మరీ అభిమానులకు థ్యాంక్యూ చెబుతున్నారు. తన టీమ్ గురించి చెప్పం, తనతో పని చేసిన నటీనటుల గురించి చెప్పడం, ఆఖరిగా ఈ విజయం అందించిన ప్రేక్షకులకు థ్యాంక్యూ చెప్పడం లాంటి ఆ లేఖలో ఉంటాయి. ఇటీవల విడుదలై మంచి విజయం అందుకున్న ‘సీతారామం’ టీమ్ కూడా ఇలాంటి పనే చేసింది. అయితే అందులో అక్షరదోషాలతో ఇబ్బంది పడింది.
‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి తమ సినిమా గురించి గొప్పగా చెబుతూ… పనిలో పనిగా టీమ్ పడ్డ కష్టం గురించి కూడా చెప్పారు. సినిమా అంతా ఓ లేఖ ఆధారంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఆ విషయం తెలిపేలా పాత స్టైల్ లేఖ రూపంలో హను తన మనసులో మాటల్ని వివరించాడు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఆ లేఖ మొత్తం తప్పులే తప్పులు. లేఖలో ఎన్ని వాక్యాలు ఉన్నాయో.. అన్ని తప్పులు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు.
హను రాసిన ఆ లేఖను దుల్కర్ సల్మాన్ కూడా తన సోషల్ మీడియా వాల్‌లో షేర్ చేశాడు. దీంతో దుల్కర్‌కి కూడా తప్పుల సెగ అంటుకుంది. హనుకి సినిమాల మీద చాలామంచి పట్టు ఉందని, కవితాత్మకంగా అతని సినిమా రావడం వెనుక అదే కారణమని అంటుంటారు. అయితే చిన్న చిన్న పదాలు కూడా తప్పు రాయడం ఏంటో అర్థం కావడం లేదు. ఈ లేఖను హను రాసి ఇస్తే.. ఎవరో టైప్ చేసి ఉండొచ్చు, లేదంటే చెబుతుంటే టైప్ చేసి ఉండొచ్చు. మరోసారి చెక్ చేసుకోకుండా ఇవ్వడమే ఇక్కడ సమస్య.
మొదలుపెట్టాలో, హృదయమై, తెలుగు, అన్నట్టు, రూపం, నిపుణులు, సీతారామం, కేవలం లాంటి చిన్న చిన్న పదాలు కూడా తప్పుగా రాశారు ఆ లేఖలో. తన సినిమా పేరునే తాను ఇలా రాయడం ఏంటో అర్థం రావడం లేదు. ఆఖరికి తెలుగు అనే పదం కూడా సరిగ్గా రాయలేదు. ఈ వార్త రాసే సమయానికి హను రాఘవపూడి ఈ పోస్ట్ పెట్టి 3 గంటలు దాటినా ఇంకా మార్చకపోవడం మరో విడ్డూరం.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?