OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

‘ఓజి’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు.. యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఆల్రెడీ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.. అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అలాగే ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన ‘ఫైర్ స్టార్మ్’ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా ‘సువ్వి సువ్వి’ అంటూ మరో లిరికల్ సాంగ్ ను వినాయక చవితి కానుకగా వదిలారు.

OG

‘ఉండిపోవా ఉండిపోవా ఇలాగ..తోడుగా నా మూడు ముళ్ల లాగ నిండిపోవా నీడ లాగ నీలాగా’ అంటూ చాలా స్లోగా మొదలైంది ఈ పాట.తర్వాత ‘సువ్వి సువ్వి సువ్వాలా.. సూదంటూ రాయే పిల్లా, మళ్ళీ మళ్ళీ చూసేలా చేసిందే మాయే ఇల్లా’ అంటూ హై ఇచ్చింది.

కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించిన ఈ పాటకు తమన్ అందించిన ట్యూన్ క్యాచీగా ఉంది. శృతి రంజని ఈ మెలోడీ సాంగ్ ను ఆలపించడం జరిగింది. ఓజి(పవన్ కళ్యాణ్) ఫ్యామిలీ లైఫ్ ను, ముఖ్యంగా అతని భార్య కన్మణిని(ప్రియాంక అరుల్ మోహన్) పరిచయం చేస్తూ ఈ పాట సాగింది. ఇందులో ప్రియాంక ఓ డాక్టర్ గా కూడా కనిపించబోతుంది అని ఈ పాటలోని విజువల్స్ చెబుతున్నాయి. గ్లింప్స్, మొదటి పాట రేంజ్లో అయితే ఈ ‘సువ్వి సువ్వి’ లేదు కానీ… కథకి ఆడియన్స్ ను ప్రిపేర్ చేసే విధంగా ఉందని చెప్పాలి.

ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ ట్రోల్‌ అవుతున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus