MM Keeravani: ఆ కామెంట్స్ తో ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్న కీరవాణి.. ఏమైందంటే?

రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి సినిమాలోని నాటు నాటు సాంగ్ కూడా కారణమని చెప్పవచ్చు. ఈ సాంగ్ ఏ స్థాయిలో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ కు ఆస్కార్ రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత నాటు నాటు సాంగ్ గురించి కీరవాణి (M. M. Keeravani) చేసిన కొన్ని కామెంట్లు ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే.

అయితే నాటు నాటు సాంగ్ గురించి కీరవాణి తాజాగా మరో సందర్భంలో మళ్లీ నిరాశకు గురి చేసే కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. త్వరగానో ఆలస్యంగానో నేను అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వని సాంగ్ కు మంచి గుర్తింపు వచ్చిందని కీరవాణి తెలిపారు. తన సినీ కెరీర్ లో నాటు నాటు సాంగ్ కంటే ఎన్నో బెస్ట్ సాంగ్స్ ను కంపోజ్ చేశాననే ఆలోచనతో కీరవాణి ఈ కామెంట్లు చేశారు.

అయితే కీరవాణి ఈ సాంగ్ గురించి స్పందించకుండా ఉంటేనే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కీరవాణి ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. కీరవాణి పారితోషికం సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉంది. కీరవాణి కొత్త సినిమా ఔరో మే కహా దమ్ థా వచ్చే నెల 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.

మహేష్  (Mahesh Babu) రాజమౌళి కాంబో మూవీకి కీరవాణి మ్యూజిక్ పనులను త్వరలో మొదలుపెట్టనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు కీరవాణి ఎలాంటి ట్యూన్స్ ఇస్తారనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus