కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. థియేటర్ లు మూతపడ్డాయి. షూటింగ్ లు చాలా వరకూ ఆగిపోయాయి. పేద సినీ కళాకారులకు పని లేకపోవడంతో పూట గడవని పరిస్ధితి. ఇలాంటి కఠినమైన పరిస్థితిలో మెగాస్టార్ చిరంజీవి ఓ స్టెప్ తీసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో మీటింగ్ లు నిర్వహించారు. టాలీవుడ్ పెద్దలు అందరూ ఈ మీటింగ్ లకు హాజరయ్యారు. అయితే ‘ఆ మీటింగ్ లకు నన్ను పిలవలేదు అంటూ బాలయ్య మీడియా ముఖంగా మండి పడ్డారు.
తలసానితో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా? భూములు పంచుకుంటున్నారా?’ అంటూ బాలయ్య కామెంట్స్ చెయ్యడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ విషయం పై ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మోహన్ బాబు ప్రశ్నించగా. ఈ విధంగా జవాబిచ్చారు. ‘కొన్ని విషయాలు నేను మాట్లాడను. నన్ను అడగొద్దు. బాలకృష్ణను నేను బాలయ్య అంటాను, సోదర అంటాను, మా అన్నగారి కుమారుడు, ఆయనకు నేను గౌరవం ఇస్తాను, నా కన్నా చిన్నవాడు, ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్, మేం ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటాం.
ఎవరి వ్యక్తి గత విషయాలు వాళ్లవి.వాటి గురించి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ల అభిప్రాయాలు తప్పు అని నేను చెప్పను. ఆయన అభిప్రాయం ఆయనది. నా గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను సమాధానం చెప్తాను.ఆ మీటింగ్ లకు నన్ను కూడా పిలవలేదు’ అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు.