Mohan Babu: ఆ కారణం వల్లే అయోధ్యకు వెళ్లలేదు: మోహన్ బాబు

జనవరి 22వ తేదీ అయోధ్య రామ మందిరం ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈరోజున శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే రామజన్మభూమి ట్రస్ట్ వారు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంతోమంది సెలబ్రిటీలు రాబోతున్నారు. ఇప్పటికే రామ మందిరం ట్రస్ట్ నిర్వాహకులు పలువురు సినిమా సెలబ్రిటీలను రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలను కలిసి వారికి రామ మందిర ఆహ్వానం పత్రికను అందజేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా పలువురు హీరోలకు ఈ ఆహ్వానం అందింది. ఇప్పటికే రామ్ చరణ్ చిరంజీవి ప్రభాస్ పవన్ కళ్యాణ్ వంటి సినీ సెలబ్రిటీలకు ఈ ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీకి అయోధ్య నుంచి ఆహ్వానం అందలేదన్న సందేహాలు అందరికీ వ్యక్తం అయ్యాయి ఈ విషయం గురించి మోహన్ బాబు మాట్లాడుతూ తమ కుటుంబానికి కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం అందిందని తెలియజేశారు.

రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం అందడమే కాకుండా తమకు సెక్యూరిటీ కూడా కల్పిస్తామని తెలియజేశారు కానీ భయం వల్లే మేము అయోధ్యకు వెళ్లడం లేదు అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయోధ్య వెళ్ళకపోయినా ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఇక్కడ పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము అంటూ మోహన్ బాబు (Mohan Babu) చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus