స్వయంకృషితో సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన నటులలో మోహన్ బాబు ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న మోహన్ బాబు తనకు మాత్రమే సొంతమైన నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒకవైపు సినిమాల్లో హీరో రోల్స్ లో నటిస్తూనే మరోవైపు విలన్ రోల్స్ లో కూడా నటించి మోహన్ బాబు సత్తా చాటారు. సొంత బ్యానర్ పై తెరకెక్కే సినిమాల్లో మోహన్ బాబు ఎక్కువగా హీరోగా నటించారు.
దాసరి నారాయణరావు డైరెక్షన్ లో మోహన్ బాబు హీరోగా కేటుగాడు అనే సినిమా తెరకెక్కగా పరిశ్రమలో చాలామంది నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. అయితే హీరోగా కేటుగాడు సినిమాతో మోహన్ బాబు విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధించలేదు. వరుస పరాజయాల తర్వాత రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో మోహన్ బాబు హీరోగా అల్లుడుగారు సినిమాలో నటించారు.
అల్లుడుగారు సినిమాకు మోహన్ బాబు నిర్మాత కాగా ఆ సినిమా ఫ్లాప్ అయితే మోహన్ బాబు మద్రాస్ వదిలి వెళ్లిపోతాడనే కామెంట్లు వినిపించాయి. అల్లుడు గారు సినిమా సక్సెస్ సాధించడంతో మోహన్ బాబు నిర్మాతగా కూడా నిలబడ్డారు. అల్లుడుగారు మలయాళ మూవీకి రీమేక్ కాగా శోభన హీరోయిన్ పాత్రలో రమ్యకృష్ణ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమాకు కేవీ మహదేవన్ ఇచ్చిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని ముద్దబంతి పువ్వులో మూగ బాసలు పాటలు ఈతరం ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. అల్లుడు గారు సినిమా మోహన్ బాబుకు ధైర్యంతో పాటు మరిన్ని సినిమాలను నిర్మించే డబ్బు ఇచ్చింది.