హైదరాబాద్‌లో నేడు ‘మా’ కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారం జరిగింది. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచిన విషయం తెలిసిందే. ఇక మంచు విష్ణు, ఇతర ప్యానెల్ సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మోహన్‌బాబు హాజరయ్యారు. అయితే ఇందులో చిరంజీవికి ఆహ్వానం అందలేదని విమర్శలు వచ్చాయి. ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడిన మోహన్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
మాలో రాజకీయాలు ఉండకూడదు అంటూ అందరం ఒకే తల్లి బిడ్డలమని సీనియర్లను గౌరవిస్తాను కానీ, అది ఇప్పుడు పోయింది అంటూ మంచు మోహన్‌బాబు ఆరోపించారు. ఇక తన జీవితం తెరిచిన పుస్తకం అంటూ రాజకీయం కంటే ఇక్కడ పాలిటిక్స్ ఎక్కువ అయ్యాయని అన్నారు. ఇక్కడ నువ్వు గొప్పా నేను గొప్పా కాదు. జయాపజయాలు దేవుడి చేతిలో ఉంటాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి అని అన్నారు. ఇక మనం కళాకారుల గురించే మాట్లాడాలి అంటూ రాజకీయ నాయకుల గురించి కాదని..
నా బిడ్డను గెలిపించిన మీరే నా దేవుళ్లతో సమానమని అన్నారు. అలాగే ఓటు వేయనివారిపై పగలు పెంచుకోవద్దని తెలియజేసిన మోహన్ బాబు అలాంటి ఆలోచన సర్వనాశనం చేస్తుందని వివరణ ఇచ్చారు. అయితే మోహన్ బాబు చేసిన పలు వ్యాఖ్యలు మెగాస్టార్ ను ఉద్దేశించి అన్నట్లుగా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!